ఆటా కొత్త అధ్యక్షుడు రాజేందర్ జిన్నా

ATA
అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) అధ్యక్షుడిగా 2011గాను డాక్టర్ రాజేందర్ జిన్నా వ్యవహరిస్తారు. ఆటా వార్షిక బోర్డు సమావేశం ఈ నెల 8వ తేదీన లాస్ వేగాస్‌లో జరిగింది. అమెరికాలోని తెలుగువారు పెద్ద యెత్తున ఈ సమావేశానికి హాజరయ్యారు. ఉదయం పూట సమావేశంలో అధ్యక్ష కార్యదర్శుల నివేదికలను ఆమోదించి, ఆటా కార్యక్రమాలపై చర్చించారు. ఆ తర్వాత అధ్యక్షుడిగా పదవీ కాలం పూర్తి చేసుకున్న మాధవరెడ్డి కొత్త అధ్యక్షుడు డాక్టర్ రాజేందర్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు.

పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాజేందర్ కొత్త కార్యవర్గ కమిటీ ఎన్నికలు జరిపారు. ప్రెసిడెంట్ ఎలెక్టుగా కరుణాకర్ మాధవరం, కార్యదర్శిగా రామ్మోహన్ కొండా, సంయుక్త కార్యదర్శిగా సత్యనారాయణ రెడ్డి కందిమల్ల, కోశాధికారి రామ్ తూమ్‌కుంట్ల ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2011కి గాను కార్యాచరణ ప్రణాళికను ఆమోదించారు. ఆటా బోర్డు 2012 సమావేశం జులై 6వ తేదీన అట్లాంటాలో జరుగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+