డల్లాస్‌లో తెలంగాణ విమోచన ఉత్సవాలు

టెలీ కాన్ఫరెన్స్ ద్వారా తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ మాట్లాడారు. నిజాం పాలనలో జరిగిన తెలంగాణ పోరాటంపై ఆయన వివరించారు. నిజాం పాలనలో జరిగిన అరాచకంపై శ్రీధర్ దేవులపల్లి మాట్లాడారు. వరంగల్ శాసనసభ్యుడు వినయ్ భాస్కర్ తెలంగాణ ఉద్యమంలో తన అనుభవాన్ని వివరించారు.
పిల్లలకు వినోదాత్మక కార్యక్రమాలు జరిగాయి. శ్రేయ తిప్పన, మేఘ గనపరం, ప్రజ్ఞ బ్రహ్మదర, శ్రియా వాస్కర్ల జానపద నృత్యాలు అలరించాయి. గూడ సుధీర్ రెడ్డి వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది. రామ్ కాసర్ల, రఘువీర్ రెడ్డి, రాజేశ్ పిల్లలమర్రి, శ్రీనివాస్ తిప్పన, భాను చౌదరి, వెంకట్ సేరి, మోహన్ పడిగెల, మహేష్ మేరెడ్డి,తదితరులు ఈ కార్యక్రమ నిర్వహణలో పాలు పంచుకున్నారు.












Click it and Unblock the Notifications