చికాగోలో తెలంగాణ నైట్

జ్యోతి ప్రజ్వలనంతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. గణేషుడికి, తెలంగాణ తల్లికి ప్రార్థనలు చేశారు. ఆ తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. పిల్లలు అత్యంత ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రవి టొకాలా, రాజ్ కల్వకోట, ప్రవీణ్ జలిగామా తమ ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు. అందెశ్రీ రాసిన జయ జయహే తెలంగాణ, గద్దర్ పొడుస్తున్న పొద్దు మీద పాటలు ఎక్కువగా ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత పిల్లలకు మెమెంటోలు, బహుమతులు అందించారు. ఈ కార్యక్రమాన్ని విజయం చేసినవారందరికీ కృతజ్ఞతలు చెప్పినట్లు చిటా ప్రతినిధి తిరుమల్ నెల్లుట్ల ఓ ప్రకటనలో తెలిపారు.












Click it and Unblock the Notifications