వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ కోసం లండన్‌లో ప్రదర్శన

By Pratap
|
Google Oneindia TeluguNews

Telangana
తెలంగాణ జెఎసి ఈ నెల 10వ తేదీన మిలియన్ మార్చ్ టు హైదరాబాదు కార్యక్రమానికి సంఘీభావంగా లండన్‌లోని తెలంగాణ ఎన్నారైలు ప్రదర్శన చేపట్టనున్నారు. లండన్‌లోని భారత హై కమిషన్ కార్యాలయం వద్ద వారు ఈ ధర్నా చేయనున్నారు. యుకె ఐరోపా తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం (టిడిఎఫ్) కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును డిమాండ్ చేస్తూ వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

ఈ నెల 10వ తేదీ ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు ఇండియా హౌస్ ముందు తెలంగాణ ఎన్నారైలు ధర్నా చేస్తారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ ఉద్యమం భారతదేశంలో అత్యంత పాతదని, 1969లో ఉద్యమానికి 369 మంది బలయ్యారని టిడిఎఫ్ చెప్పింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని యుపిఎ ప్రభుత్వం ఉమ్మడి కనీస ప్రణాళికలో ప్రస్తావించిందని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం 2009 డిసెంబర్ 9వ తేదీన ప్రకటన చేశారని టిడిఎఫ్ ప్రతినిధి నాగేందర్ చిందం చెప్పారు.

English summary
TDF UK Europe chapter is organizing peaceful gathering near Indian High Commission, London. Telangana Non-Resident Indians are gathering to express the solidarity for the million people march which is going to be held in Hyderabad, India for the demand of separate Telangana state in India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X