జయశంకర్‌తో అనుబంధంపై ఎన్నారైలు

Telangana NRIs
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్‌తో తమ అనుబంధాన్ని అమెరికాలోని వాషింగ్టన్ డిసి తెలంగాణ ఎన్నారైలు నెమరేసుకున్నారు. వారు ఈ నెల 25వ తేదీన వాషింగ్టన్ డిసి మెట్రోపాలిటన్ ప్రాంతంలో సమావేశమై జయశంకర్ మృతికి సంతాపం ప్రకటించారు. జయశంకర్ సమీప బంధువు అచ్యుత్ ఈ సమావేశానికి హాజరయ్యారు. తెలంగాణ ఉద్యమానికి జయశంకర్ అందించిన సేవలను రాజేష్ మాదిరెడ్డి గుర్తు చేశారు. అమెరికాలో 1999లో తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం (టిడిఎఫ్) ఏర్పాటుకు జయశంకర్ చేసిన కృషిని ఎన్నారైలు గుర్తుకు తెచ్చుకున్నారు.

కాకతీయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్‌గా పని చేసినప్పుడు జయశంకర్ విద్యార్థుల సమస్యలను ఎలా పరిష్కరించారో ఆ విశ్వవిద్యాలయం మాజీ విద్యార్థి విష్ణు మాధవరం వివరించారు. జయశంకర్ మృతి తీరని లోటు అని రాజేష్ బాదం అన్నారు. తెలంగాణలోని అత్యంత విద్యావంతుల్లో జయశంకర్ ఒకరని సంతోష్ వేముల అన్నారు. జయశంకర్ స్ఫూర్తితో తెలంగాణ సాధనకు మనమంతా పునరంకితం కావాలని రమణ కంచెట్టి అన్నారు. జయశంకర్ పరిశోధనా పత్రాలు, డాక్యమెంట్లు, ప్రసంగాలను భద్రం చేయడానికి హైదరాబాదులో ఓ ప్రదర్సనశాలను ఏర్పాటు చేయాలని జగదీష్ బొందుగుల రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కృష్ణ దొమ్మాట, అనిల్ కేశినేని, రామ్ ఎనగంటి, రవీందర్ గడ్డంపల్లి, వేణు రవ్వా, విజయ్ సేరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+