వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయశంకర్ మృతికి ఎన్ఆర్ఐల సంతాపం

By Pratap
|
Google Oneindia TeluguNews

K Jayashankar
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ మృతికి అమెరికాలోని తెలంగాణ ఎన్నారై అసోసియేషన్ (తెనా) సంతాపం ప్రకటించింది. తన జీవిత ఆకాంక్ష తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యానికి దగ్గరైన తరుణంలో జయశంకర్ విచారకరమని తెనా చైర్మన్ రవి మేరెడ్డి, కన్వీనర్ హరి మారోజు, కోశాధికారి అమర్ కర్మిల్లా అన్నారు. జయశంకర్ విద్యార్థి దశ నుంచి తుది శ్వాస విడిచే వరకు తన జీవితాన్ని మొత్తం తెలంగాణ కోసమే అంకితం చేశారని వారు ఓ ప్రకటనలో అన్నారు. తెలంగాణ తప్ప జయశంకర్‌కు మరో వ్యక్తిగత జీవితం లేదని, తెలంగాణ సాధనే తన జీవిత ధ్యేయంగా పనిచేశారని వారు ప్రశంసించారు. జయశంకర్ అంకిత భావంతో కూడిన నిరంతర పోరాట యోధుడని వారన్నారు.

జయశంకర్ మంచి అకడిమిషియన్, మానవతావాది అని వారు కొనియాడారు. అధ్యాపకుడిగా ఎంతో మంది విద్యార్థులకు జయశంకర్ సహాయం చేశారని వారు చెప్పారు. ఉద్యమాన్ని జయశంకర్ తనవంటి వారి చేతుల్లో పెట్టిపోయారని వారన్నారు. తెలంగాణలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ కోసం పోరాటం చేయడానికి ఎన్నో విశాల వేదికల ఏర్పాటుకు జయశంకర్ కారణభూతులయ్యారని వారు చెప్పారు. జయశంకర్ ఆశయాన్ని సాధించడమే ఆయనకు అర్పించే నిజమైన నివాళి అని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం సాధిస్తేనే జయశంకర్ ఆత్మకు శాంతి చేకూరుతుందన్నారు. జయశంకర్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని లక్ష్యసాధనకు అంకితం కావాలని వారు తెలంగాణ ప్రజలకు సూచించారు.

English summary
Telangana NRI Association (TeNA) mourns the passing away of Prof. Jayashankar. It is unfortunate that he has passed away at a time when his life’s dream was never as close as today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X