చికాగోలో వైయస్ ఫ్యాన్స్ సమావేశం

వైయస్సార్ అభిమానులను టెలికాన్ఫరెన్స్ ద్వారా కొండపల్లి సత్యనారాయణ రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు గోనె ప్రకాశరావుకు, రోజాకు పరిచయం చేశారు. రైతుల సంక్షేమానికి వైయస్సార్ అంకిత భావంతో పనిచేశారని రోజా చెప్పారు. ప్రస్తుత రైతుల దుస్థితికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబే కారణమని కొండపల్లి విమర్శించారు.
ఆటా వ్యవస్థాపకుడు హనుమంత రెడ్డి, ఆటా ప్రెసిడెంట్ ఎలెక్ట్ కరుణాకర్ రావు మాధవరం, ఆటా కోశాధికారి కెఎస్ఎన్ రెడ్డి, ఆటా ట్రస్టీలు సి. నరేందర్ రెడ్డి, ఆటా పిఆర్ చల్మా రెడ్డి బండారు, టిఎజిసి ప్రెసిడెంట్ ఎలెక్ట్ కళ్యాణ్ ఆనందుల, టిఎజిఎసి మాజీ అధ్యక్షుడు అమర్ నెట్టెం వంటి పలువురు ప్రముఖులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications