థాయ్‌లో బస్సు ప్రమాదం: భారతీయులు మృతి

రిసార్టుకు వెళుతుండగా టైరు పేలిపోవడంతో బస్సు అదుపు తప్పి ఓ ఎలక్ట్రిక్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో పదిమంది మృతి చెందారు. వారిలో ఇద్దరు భారతీయులు ఉన్నారని పోలీసు అధికారులు తెలిపారు. పదిహేడు మందికి తీవ్రంగా గాయాలైనట్లు చెప్పారు.
ప్రయాణీకులు బయలుదేరిన ఈ కో సముయ్ రిసార్ట్ ఉన్న ద్వీప ప్రాంతం పర్యాటక ప్రసిద్ధి చెందినది. ఈ ఘటన మంగళవారం ఉదయం సూరత్ థానీ సదరన్ ప్రావిన్స్‌లో జరిగిందని చెప్పారు. మిగతా మృతులు థాయ్‌లాండ్‌కు చెందిన వారని, చనిపోయిన వారిలో బస్సు డ్రైవర్ కూడా ఉన్నారని చెప్పారు.












Click it and Unblock the Notifications