సవిత మృతి: ఐర్లాండ్‌లో చట్ట సవరణ

కాగా అబార్షన్‌కు వైద్యులు నిరాకరించడంతో ఐర్లాండులో భారతదేశానికి చెందిన సవిత హలప్పన్ అనే మహిళ మృత్యువాత పడిన విషయం తెలిసిందే. రక్తం విషం ఎక్కి ఆమె మరణించింది. కాథలిక్ దేశం కాబట్టి తాము అబార్షన్ చేయబోమని వైద్యులు చెప్పారు. దీంతో ఆమె మరణించింది. మృత్యువాత పడిన 31 ఏళ్ల భారత మహిళ డెంటిస్టు. ఆ మహిళ సవితా మృతిపై ఐరిష్ అధికారవర్గాలు విచారణకు ఆదేశించాయి.
ఆమె 17 వారాల గర్భవతి. ఆమె మిస్ క్యారేజీతో బాధపడుతోంది. సెప్టికేమియాతో కూడా బాధపడుతోంది. గాల్వేలోని బోస్టన్ సైంటిఫిక్ ఇంజనీర్ అయిన ఆమె భర్త ప్రవీణ్ హలపనవార్ - అబార్షన్ చేయాలని మూడు రోజులుగా ఎన్నో సార్లు విజ్ఞప్తి చేశాని చెప్పారు. ఓ రోజు సవిత భరించలేనంత నొప్పితో బాధపడిందని, దాంతో అబార్షన్ కోసం అడిగామని చెప్పారు. గర్భస్థ శిశువు గుండె కొట్టుకుంటోందని, ఇది కాథలిక్ దేశం కాబట్టి మనిషి చంపే అబార్షన్ చేయబోమని వైద్యులు చెప్పారని ఆయన వివరించారు.
మృతశిశువును తర్వాత బయటకు తీశారు. సవితను హై డిపెండన్సీ యూనిట్‌కు, ఆ తర్వాత ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌కు తరలించారు. అయితే, ఆమె అక్టోబర్ 28వ తేదీన యూనివర్శిటీ ఆస్పత్రి గాల్వేలో సెప్టికేమియాతో మరణించింది. ఐర్లాండ్‌లో అబార్షన్ చట్ట విరుద్దం. అయితే, సవిత మృతిపై దర్యాప్తు సాగుతోంది. తాను ఐరిష్‌ను గానీ కాథలిక్‌ను గానీ కానని కర్ణాటకకు చెందిన సవిత మరణించే ముందు అన్నారు.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్‌ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications