వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

న్యూజెర్సీలో బతుకమ్మ సంబరాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూజెర్సీ : ఉత్తర అమెరికాలోని న్యూ జెర్సీ రాష్ట్రంలో అక్టోబర్ మాసం , ఆదివారం. చిరు చలి గాలులు వీస్తున్న మధ్యాహ్న సమయం. సూర్యుడు క్రమంగా తన ప్రతాపాన్ని కోల్పోతున్న వేళ! హై లాండ్ పార్క్ పట్టణంలోని డొనాల్డ్సన్ పార్క్ లో కోలాహలం! తెలంగాణ స్త్రీలు, రంగు రంగుల చీరలు ధరించి, ఆడంబరంగా నగలు, మణిహారాలు వేసుకుని, స్త్రీలు తమ తమ ఆడ పిల్లలని బహుసుందరంగా ముస్తాబు చేసి రకరకాల ఆభరణాలు ధరింపచేసి, చేతుల్లో పెద్ద పెద్ద బతుకమ్మలని తీసుకుని, సంతోషంగా పాడుకుంటూ వస్తున్నారు.

Bathukamma celebrations in New Jersey

అంతకు ముందే అక్కడికి చేరుకున్న స్త్రీలు తమ తమ బతుకమ్మలని చక్కని వేదిక మీద ఉంచి అగరువత్తులు వెలిగించి భక్తిగా పూజించారు. ‘న్యూ జెర్సీ బతుకమ్మ ఉత్సవాలు' అని కట్టి ఉన్న బ్యానర్ ముందు ప్రొ. జయశంకర్ చిత్రపటం. దాని ముందు బతుకమ్మలు ఉంచిన వేదిక. న్యూ జెర్సీ తెలంగాణ అసోసియేషన్ బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలని ఇచ్చిన పిలుపును అందుకుని న్యూ జెర్సీ రాష్ట్ర నలుమూలల నుండీ వందలాది తెలంగాణ కుటుంబాలు ఇంటిల్లిపాదీ తరలి వచ్చారు. తెలంగాణ
కుటుంబాల శ్రేయోభిలాషులైన ఆంద్గ్రా ప్రాంతపు మిత్రులు కూడా చాలా మందే తరలి వచ్చారు.

ప్రొ. జయశంకర్ చిత్రపటానికి రవి ధన్నపునేని పూల మాల వేసి బతుకమ్మ పండుగ ఉత్సవాలను ప్రారంభించారు. శిరీష పొగాకు, కవిత పెద్ది, మంజుల గనగోని, లావణ్య బుపతి, సుభాషిణి తంగ్డ , ఇందు బస, భాను మాగంటి, రాణి వెలిశాల, సరిత చింతావర్ వసంత గడ్డంసెట్టి, మీనా మంద, లక్ష్మి దేవినేని, కల్పన సువర్ణ, విద్య వెంకటయోగి, సంగీత ధన్నపునేని తదితరులు బతుకమ్మ ఉత్సవాలని ఒక అద్భుతమైన కార్యక్రమంగా తీర్చిదిద్దడానికి తమ శాయశక్తులూ ఒడ్డి కృషి చేసారు.

తాము స్వయంగా పెద్ద పెద్ద బతుకమ్మలను, తెలంగాణ గడ్డ మీద బతుకమ్మలతో పోటీ పడే బతుకమ్మలను, పట్టు కుచ్చుల పూలు, గునుగు పూలు తదితర పూలతో పేర్చుకుని వక్చారు. వచ్చిన అతిథులందరికీ భోజన సదుపాయాలు కల్పించారు. పిల్లలతోటి , పెద్దల తోటి అనేక ఆటలు ఆడించి
బహుమతులు ప్రదానం చేసారు. అనేక కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ ఉత్సవాలను విజయవంతం చేయడంలో భాస్కర్ బుపతి, జే మందా, రవి పెద్ది శ్రీనివాస్ గనగోని, గురునాధం ఆలంపల్లి, స్రినివాస్ కోడూరు, మహేశ్ పొగాకు, శ్రీ కుమార్ తోకల, ప్రశాంత్ చింతావర్ , స్వామి వెంకటయోగి, శ్రవన్ నాగపురి కిశోర్ భూపతి, రమేష్ మాగంటి, సంతోష్ రెడ్డి పాతూరు, రజాం చిలుక, ప్రదీప్ సువర్ణ, రవి ధన్నపునేని, ఇంద్రసేనా రెడ్డీ తుది, పమోహన్ రెడ్డీ దేషిడి , నర్సింగ్ చింతపల్లి, దత్తు ప్రసాద్ , ప్రవీన్ బెల్లంకొండ తదితరులెందరో ప్రదాన పాత్ర వహించారు. రవి తోట, పుర్ణచందర్ సిరికొండ, మహేష్ పొగాకు అధిక మొత్తంలో విరాళాలు ఇచ్చి కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు తోడ్పడ్డారు. కంట్రీ ఒవెన్ , దక్షిణ, పారడైస్ బిర్యాని, కోరియాండర్ , హైదరాబాద్ బావర్చి, మిర్చి మరియు స్పైస్ జోన్ రెస్టారెంటులు భోజనాలని ఏర్పాటుచేసారు.

పిల్లల పెద్దల ఆటల కార్యక్రమాలయ్యాక, ఎప్పుడెప్పుడా అని ఎదిరి చూస్తున్న స్త్రీలు పెల్లుబికిన ఉత్సాహంతో, ఉరకలేసే ఆనందాతిరేకంతో బతుకమ్మలాడటానికి ఉపక్రమించారు. మధ్యలో బతుకమ్మలని ఉంచి చుట్టూ వలయంగా చప్పట్లు కొడుతూ, లయ బద్దంగా కాల్లు కదుపుతూ బతుకమ్మ పాటలు పాడుకుంటూ
బతుకమ్మలాడారు. మధ్యలో శ్రవన్ నాగపురి తన మ్యూజిక్ సిస్టంతో శ్రద్దగా బతుకమ్మ పాటలని మోగిస్తుండగా స్త్రీలు, ఆడపిల్లలు అవధుల్లేని ఆనందంతో బతుకమ్మలాడారు.

తర్వాత విద్య వెంకట యోగి, శిరీష పొగాకు తమ శ్రావ్యమైన కంఠాలతో బతుకమ్మ పాటలు పాడగా సంగీత ధన్నపునేని తదితరులు కోరస్ ఇవ్వగా ,ఆడవాళ్ళు, పిల్లలు ఎంతో ఉత్సాహంగా బతుకమ్మలాడారు. ఈ కార్యక్రమానికి న్యూజెర్సీ అసెంబ్లీ మెన్ శ్రీ ఉపేంద్ర చివుకుల హాజరై బతుకమ్మ ఆడిన వారికి అభినందన తెలియజేసి, బతుకమ్మలలో ఉతమమైన నాల్గింటికి బహుమతులందించారు. తర్వాత ఆటల్లో గెల్చిన పిల్లలకు బహుమతి ప్రదానం చేసారు. తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబమైన బతుకమ్మని కొనియాడి , శ్రీ ఉపేంద్ర బతుకమ్మ ఉత్సవానికి విచ్చేసిన అందరికీ అభినందనలు తెలియజేసారు. కార్యక్రమానికి ప్రముఖులు హరి ఎప్పనపల్లి కూడా హాజరయ్యారు.

బుద్ది తీరా తృప్తిగా బతుకమ్మలాడినంక ఆడవాళ్ళు బతుకమ్మలని చేతుల్లో భద్రంగా ఎత్తుకుని, పబతుకమ్మ పాటలు పాడుకుంటూ పక్కనే ఉన్న చెరువుకేసి ప్రయాణమయ్యారు. బతుకమ్మలని గౌరమ్మలని మరొక్క సారి భక్తి తో కొలిచిన ఆడవాళ్ళు బతుకమ్మలని చెరువులో వదిలి భక్తి శ్రద్దలతో దండం పెట్టుకుని, కళ్లలో ఆనందబాష్పాలతో బతుకమ్మలని నిమజ్జనం చేసారు. తమ వెంట తెచ్చిన బతుకమ్మ ప్రసాదమైన సద్దులని మలీద ముద్దలని అందరికీ పంచి తామూ ఆనందంగా తిని, నీళ్ళలో తేలిపోతున్న తమ తమ బతుకమ్మలని కడసారిగా చూసుకుని ఇళ్ళ వైపు ప్రయాణమయ్యారు.

తెలంగాణ ప్రత్యేక సాంస్కృతిక చిహ్నమైన బతుకమ్మని ఘనంగా జరుపుకుని మరొక్క మారు తెలంగాణ జండాను అమెరికాలో న్యూ జెర్సీ లోన్యూ జెర్సీ తెలంగాణ అసోసియేషన్ తరపున సమున్నతంగా ఎగరేసారు.

English summary
Bathukamma is celebrated at New Jersey of USA in a happy mood. New Jersey Telangana association vreated a plotdorm to celebrate Bathukamma.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X