అమెరికా నుంచి వచ్చిన బిజినెస్‌మేన్ అరెస్టు

పోలీసులు అందించిన వివరాల ప్రకారం - 46 ఏళ్ల గురు ప్రసాద్ తివారీ అనే వ్యాపారవేత్త తన నిజమైన పేరుతో 1991లో ఓ పాస్‌పోర్టు తీసుకున్నాడు. అమెరికాకు దానిపై వీసా లభించకపోవడంతో 1992లో సత్గురు పెర్షాద్ తివారీ అనే పేరుతో మరో పాస్‌పోర్టు తీసుకున్నాడు.
రెండో పాస్‌పోర్టుతో అతనికి 1993లో వీసా వచ్చింది. దాంతో అతను దానిపై 2000 వరకు అమెరికాలో ఉన్నాడు. తన పాస్‌పోర్టు పోయిందని అబద్ధం చెప్పి అమెరికాలో ఉన్నప్పుడు న్యూయార్క్ భారత కాన్సులేట్ నుంచి తన నిజమైన పేరుతో మూడో పాస్‌పోర్టు తీసుకున్నాడు.
తివారీ ప్రస్తుతం హాజరీస్ వ్యాపారం చేస్తున్నాడని, అమెరికాలో కూడా అదే వ్యాపారం చేశాడని పోలీసులు చెప్పారు. తివారీని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications