ఆస్టిన్ టెక్సాస్‌లో గురజాడ జయంతి

Gurajada birth anniversary at Austin Texas
టెక్సాస్: తెలుగు సాహిత్యంలో, సంస్కృతిలో 150 ఏళ్ల తర్వాత కూడా మహాకవి గురజాడ సంప్రదాయం బలంగా నిలిచిందని, దానికి కారణం ఆ కాలంలో ముందు చూపుతో రాసిన రచనలే అని తానా అధ్యక్షుడు తోటకూర ప్రసాద్ అన్నారు. ఆస్టిన్‌లోని టెక్సాస్ విశ్వవిద్యాలయంలో గురజాడ 150వ జయంతి ఉత్సవాలను ఆయన సోమవారం ప్రారంభించారు. తానా, టెక్సాస్ విశ్వవిద్యాలయం తెలుగు విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.

పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఈ ప్రారంభ సభలో పాల్గ1న్నారు. మహాకవి గురజాడ స్మృతికి నివాళిగా ప్రముఖ అనువాదకుడు నౌడూరి మూర్తి గురజాడ అనంతర కాలంలో వెలువడిన తెలుగు కవిత్వంపై ప్రసంగించారు. తెలుగు సాహిత్య చరిత్రలో వివిధ మలుపుల్లో గురజాడ ప్రభావం బలంగా కనిపిస్తుందని ఆయన అన్నారు.

గురజాడతో మొదలుకొని ఇప్పటి దాకా వివిధ కవుల తెలుగు కవితల ఆంగ్ల అనువాదాలను వినిపిస్తూ ఆయన సోదాహరణ ప్రసంగం చేశారు. తెలుగు సాహిత్యంలో సామాజిక జీవితంలో కేవలం ఒక రచయితగానే కాకుండా సామాజిక శక్తిగా గురజాడ ప్రభావం ఎప్పుడూ ఉంటుందని, గురజాడ అంటే ఆధునికతకి పర్యాయపదామి ప్రముఖ రచయిత, టెక్సాస్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ అఫ్సర్ సభకు అధ్యక్షత వహిస్తూ అన్నారు. తానా తెలుగు భాషా కమిటి చైర్మన్ రాంకీ చేబ్రోలు, డల్లాస్ తెలుగు ప్రముఖుడు రావు కలవల కూడా సభలో మాట్లాడారు.

టెక్సాస్ విశ్వవిద్యాలయంలో తెలుగు భాషా కోర్సుల ప్రవేశానికి వెన్నెముకగా నిలిచిన ప్రసాద్ తోటకూరని ఈ సందర్భంగా టెక్సాస్ తెలుగు విద్యార్థుల సంఘం సత్కరించింది. తెలుగు సంఘం తరఫున జయశ్రీ సెట్టి, అనీష్, దామరాజు మూర్తి, అయేషా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గురజాడ జయంతి ఉత్సవాల్లో భాగంగా మరో మేూడు ప్రసంగాలను త్వరలో ఈ సెమిస్టర్‌లో ఏర్పాటు చేయబోతున్నామని సంఘం చైర్మన్ జయశ్రీ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+