సింగపూర్ చీఫ్ జస్టిస్‌గా భారత సంతతి జడ్జి

చన్ సేక్ కెయోంగ్ స్థానం సుందరేషన్ మీనన్ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. తన 75వ యేట కియోంగ్ పదవీ విరమణ చేస్తున్నారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. సుందరేషన్ పేరును అధ్యక్షుడు టోనీ టాన్ ప్రకటించినట్లు ఆ ప్రకటన తెలిపింది.
అత్యంత ప్రధానమైన బాధ్యతలను తనపై మోపడం తనకు గౌరవప్రదంగా ఉందని, తన బాధ్యతలను హుందాగా నిర్వహిస్తానని జస్టిస్ మీనన్ అన్నారు. యాభై ఏళ్ల మీనన్ హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో మాస్టర్స్ పట్టా పొందారు. సింగపూర్ నేషనల్ యూనివర్శిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.
ప్రధాన న్యాయమూర్తి బాధ్యతల నుంచి తప్పుకుంటున్న చాన్ 26 ఏళ్ల పబ్లిక్ సర్వీసులో ఉన్నారు. ఆరేళ్ల పాటు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు.












Click it and Unblock the Notifications