వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్త్రీ పట్ల అసభ్యంగా: దోషిగా టెక్కీ

By Pratap
|
Google Oneindia TeluguNews

USA Flag
వాషింగ్టన్: వర్కింగ్ వీసాపై అమెరికాలో ఉన్న ఓ భారతీయ సాఫ్ట్‌వేర్ కన్సల్టెంట్‌ను చికాగో కోర్టు గురువారం దోషిగా తేల్చింది. విమానంలో తన పక్కన కూర్చున మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడనేది ఆరోపణ. శ్రీనివాస్ ఎస్ ఎర్రమిల్లి అనే 45 ఏళ్ల టెక్కీని కోర్టు దోషిగా తేల్చింది. అతనికి గరిష్టంగా రెండేళ్ల జైలు శిక్ష, 25 లక్షల డాలర్ల జరిమానా పడుతుంది.

ఇటువంటి కేసుల్లోనే అతను గతంలో రెండు సార్లు దోషిగా తేలాడు. ఎర్రమిల్లి 2011 జూన్ 14వ తేదీన చివరగా సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ విమానంలోకి ఎక్కాడు. బాధితురాలు విమానంలో నిద్ర పోవడానికి వీలుగా విండో సీటులో కూర్చుంది. ఆమె భర్త ఇవతలి సీట్లో కూర్చున్నాడు.

తమ 34వ సంవత్సరం వివాహ ఉత్సవానికి వారు లాస్ వేగాస్ బయలుదేరారు. ఈ సందర్భంగా ఈ సంఘటన జరిగింది.విమానంలో ఎర్రమల్లి మూడు సార్లు బాధితురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తంచాడని విచారణలో తేలింది. అతని ప్రవర్తనకు బాధితురాలు భయపడి అరిచినట్లు తోటి ప్రయాణికులు విచారణలో చెప్పారు.

గతంలో 2000లో కుక్ కౌంటీ బ్యాటరీ విషయంలో దోషిగా తేలాడు. అప్పుడు అతనికి రెండేళ్లు ప్రొబషనరీ శిక్ష పడింది. ఐదు రోజుల కమ్యూనిటీ సర్వీస్ శిక్ష అనుభవించాడు. 2002లో ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకు డెట్రాయిట్‌లోని ఫెడరల్ కోర్టు మూడేళ్ల ప్రొబషన్ శిక్ష విధించింది.

English summary
An Indian software consultant, on a work visa in the US, was convicted by a Chicago court on Thursday for allegedly groping a woman while they were seated next to each other aboard an airplane.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X