• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చికాగోలో బతుకమ్మ సందడి

By Pratap
|

చికాగో: హైదరాబాదులోని హుస్సేన్ సాగర్ వద్ద తెలంగాణ కవాతు హోరు వినిపిస్తుండగానే అమెరికాలోని చికాగోలో తెలంగాణ ఎన్నారైలు బతుకమ్మ పండుగ చేసుకున్నారు. సెప్టెంబర్ 30వ తేదీ ఆదివారం చికాగో శివారులోని నేప్‌విల్లే రివర్‌వాక్ వద్ద చికాగోలోని తెలంగాణ కుటుంబాలు బతుకమ్మ పండుగ చేసుకున్నాయి. చికాగో తెలంగాణ సంఘం (చిటా) ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవంలో దాదాపు 500 మంది పాల్గొన్నారు.

North American Bathukamma Festival and Telangana Liberation Day in Chicago

ఈ బతుకమ్మ పండుగకు ఓ ప్రత్యేకత ఉంది. ఉత్తర అమెరికాలో బతుకమ్మ పండుగ చేసుకోవడం ప్రారంభించి దశాబ్ద కాలం అవుతోంది. అలాగే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం ప్రారంభించి కూడా పదేళ్లవుతోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌తో హైదరాబాదులో నిర్వహించిన తెలంగాణ మార్చ్‌తో ఈ కార్యక్రమం కలిసి వచ్చింది.

చికాగోలోని తెలంగాణ ఎన్నారైలు ఉదయం 11 గంటల నుంచి పార్కుకు చేరుకోవడం ప్రారంభించారు. కొద్దిసేపటికే వందలాది మందితో పార్కు నిండిపోయింది. గతంలో నిర్వహించిన బతుకమ్మ పండుల అనుభవాలను వారు పంచుకున్నారు. ఓ యమ్మా నా పల్లె, నాగేటి చాల్లళ్ల నా తెలంగాణ వంటి పాటనలను ఆలపించారు. జయ జయహే తెలంగాణ పాట హుషారును నింపింది.

ఆ తర్వాత మహిళలు, ఆడపిల్లలు డప్పు వాయిద్యం నేపథ్యంగా బతుకమ్మలను తీసుకుని ఊరేగింపుగా వచ్చారు. కొంత మంది మహిళలు సంప్రదాయబద్దమైన బతుకమ్మ, బతుకమ్మ ఉయ్యాలో వంటి పాటలు పాడారు. దాదాపు రెండు గంటల పాటు బతుకమ్మ ఆడుతూ పాడారు. పొద్దు గూకుతుండగా బతుకమ్మలను డుపేజ్ నదిలో నిమజ్జనం చేశారు.

చికాగోలని తన కూతురు వద్దకు వచ్చిన రామిరెడ్డి ఏలేటి - తెలంగాణ సాయుధ పోరాటం రోజులను గుర్తు చేస్తూ మాట్లాడారు. తెలంగాణ ప్రజల ఇష్టానిష్టాలకు భిన్నంగా తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల విలీనం జరిగిందని ఆయన చెప్పారు. దశాబ్ద కాలం బతుకమ్మ పండుగ నిర్వహణను గుర్తు చేస్తూ కేక్ కట్ చేశారు. ఆ తర్వాత ఉత్తమ బతుకమ్మలకు అవార్డులు ప్రదానం చేశారు.

శోభ ఎల్లంకికి ప్రథమ బహుమతి రాగా, దీప్తి జలగం రెండో బహుమతి స్వీకరించారు. స్వప్న కొండం తృతీయ బహుమతి స్వీకరించారు. ప్రత్యేక బతుకమ్మ పాటలు పాడిన వారికి కూడా బహుమతులు అందజేశారు. బతుకమ్మ, తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమాలను విజయవంతం చేసిన కృష్ణ రంగరాజు, రవి తోకల, శరత్ పున్‌రెడ్డి, శాంతం బోయిన్‌పల్లి, ప్రకాష్ జలగం, శ్రీరాం రెడ్డి ఏలేటి. శరత్ కల్వకోట, వెంకట్ జువ్వాడి, కిషన్ వంటకల, పూర్ణ అల్లంనేని, శ్రీధర్ రాజు, రమేష్ కమ్ముల, సరితా బోయిన్‌పల్లి, లక్ష్మి ఎల్లంకి, అజయ్ బోంపల్లి, శ్రీని గౌడ్, తిరుమల నెల్లుట్ల, శ్రీనాత్ చిన్నల, శ్రీను వోరుగుంటి, ప్రదీప్ దామిడి వేణు చల్లగొండ, వెంకట్ తూడి, నిరంజన్ అల్లంనేనిలకు శ్రీని పాల్తెపు కృతజ్ఢతలు తెలిపారు. మాధుర్యమైన బతుకమ్మ పాటలను పాడిన శారద బృందానికి ప్రత్యేక కృతజ్ఢతలు తెలిపారు.

English summary

 Telangana families in Chicago area gathered at Riverwalk in Naperville, a suburban town of Chicago to celebrate Bathukamma Festival on September 30th 20012. More than 500 people attended the event making it a grand success.
 This year’s Chicago Bathukamma is special in many ways. It marks the 10th Anniversary of the First Bathukamma Festival in North America.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X