నార్వేలో తెలుగు దంపతులపై అభియోగాలు

హైదరాబాద్ నగరానికి చెందిన ఓ జంటను నార్వే పోలీసులు ఓస్లో పట్టణంలో అరెస్టు చేశారు. తమ కుమారుడిని క్రమశిక్షణగా ఉంచేందుకు అతిగా ప్రవర్తించారని వారిని అరెస్టు చేశారు. వి.చంద్రశేఖర్ అనే అతను టిసిఎస్ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్)కు చెందిన కంపెనీలో ఉద్యోగి. అతని భార్య అనుపమ. చంద్రశేఖర్ ఓస్లోలో ఉద్యోగం చేస్తున్నాడు. వీరిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తమ అబ్బాయి పదే పదే స్కూలు నుంచి ఇతరుల బొమ్మలు తెస్తుండటంతో చంద్రశేఖర్ అతడిని మందలించారు. దానిపై ఆ అబ్బాయి తన పాఠశాలలోని ఉపాధ్యాయులకు ఫిర్యాదు చేయడమే కాక.. తిరిగి భారత్‌కు పంపేస్తామని బెదిరిస్తున్నట్లు కూడా వారికి చెప్పాడని చంద్రశేఖర్ తమ్ముడి కొడుకు శైలేందర్ తెలిపారు.
దీనిపై విచారించిన అక్కడి అధికార వర్గాలు చంద్రశేఖర్, అనుపమలు తమ పిల్లవాడికి చెమ్చాకు బదులు చేత్తో అన్నం పెడుతున్నారని, ఇలా అనేక రకాల తప్పులను ఎత్తి చూపారు. అయితే తాము అన్ని తప్పులు చేసినట్లు ఆ దంపతులకు తెలీదు. కానీ తొమ్మిది నెలల తర్వాత దంపతులిద్దరూ అరెస్టయ్యారు.
తమ బాబాయికి అసలు కేసు గురించి తెలియదని, తమ పిన్నిని, పిల్లలను తీసుకుని జూలైలో హైదరాబాద్ వచ్చి, తిరిగి అక్టోబర్ చివరి వారంలో ఓస్లో తిరిగి వెళ్లారని, అప్పుడే భార్యతో సహా తమ ముందు హాజరు కావాల్సిందిగా అక్కడి అధికారులు నోటీసు ఇచ్చారని శైలేందర్ చెప్పారు.
-
Charminar Express: చార్మినార్ ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు అలర్ట్-రూట్ మార్పు..! -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!! -
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్..












Click it and Unblock the Notifications