వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లండన్‌లో కొవ్వొత్తుల ప్రదర్శన

By Pratap
|
Google Oneindia TeluguNews

NRIs organise camdle light programme in London
లండన్: తెలంగాణ జెఎసి పిలుపు మేరకు ఎన్నారైలు డిసెంబర్ 9వ తేదీన ఉద్యమ స్ఫూర్తి దినం సందర్భంగా కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. తెలంగాణ ఎన్నారై ఫోరం (తెనా) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ముందుగా తెలంగాణ అమర వీరులకు నివాళులు అర్పించారు. ఆ తర్వాత తెలంగాణ ఎన్నారై ఫోరం ప్రతినిధులు మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ప్రాణాలను ఫణంగా పెట్టి, కులమతాలకు అతీతంగా తెలంగాణ ప్రజలందరినీ ఏకతాటిపైకి తెచ్చి సాధించిన తెలంగాణను సాధించారని వారన్నారు. డిసెంబర్ 9వ తేదీన చేసిన ప్రకటన మేరకు వెంటనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ నెల 28వ తేదీన తలపెట్టిన అఖిల పక్ష సమావేశానికి పార్టీ నుంచి ఒక్కరిని మాత్రమే ప్రతినిధిగా పిలువాలని, తద్వారా తెలంగాణపై చిత్తుశుద్ధిని నిరూపించుకోవాలని, అలా జరిగినప్పుడే ప్రజలు కాంగ్రెసు పార్టీని, ప్రభుత్వాన్ని విశ్వసిస్తారని వారన్నారు. లేకుంటే రానున్న రోజుల్లో తగిన బుద్ధి చెప్తారని, యాత్రల పేరు మీద దండయాత్రలు చేస్తున్న పార్టీల అసలు రంగు బయటపడుతుందని వారన్నారు.

రానున్న రోజుల్లో తెలంగాణ జెఎసి పిలుపు మేరకు క్షేత్ర స్థాయిలో ఉద్యమంలో పాలు పంచుకోవడానికి ఎన్నారైలు సిద్ధమైనట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎన్నారై ఫోరం ప్రతినిధులు రంగు వెంకట్, రాజు కొయ్యాడ, ఉదయ్ నాగరాజు, వినోద్ మాదాడ, విష్ణు రెడ్డి, రాజు, అశోక్, సభ్యులు హరి, మహేష్, సతీష్ రెడ్డి పాల్గొన్నారు.

English summary

 Telangana NRI forum has ornised candle light programme in London on December 9, marking union government statement on Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X