వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆస్ట్రేలియాలో భారతీయులే లక్ష్యం

By Pratap
|
Google Oneindia TeluguNews

Australia
మెల్‌బోర్న్: ఆస్ట్రేలియాలో జాతి వివక్ష దాడులకు భారతీయులే లక్ష్యమవుతున్నారని ఒక సామాజిక సర్వే తేల్చింది. గతంలో ఆసియా దేశాలకు చెందిన వారిపై చాలా తక్కువగా దాడులు జరిగేవని పరిశోధక బృందం పేర్కొన్నట్టుగా సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ ఒక కథనం ప్రచురించింది. ఈ అధ్యయనం ప్రకారం భారతీయ ప్రవాసుల పట్ల బాగా సానుకూలంగా ఉన్న ఆస్ట్రేలియన్ల సంఖ్య కేవలం 12.2 శాతం మాత్రమే.

భారతీయులంటే బాగా వ్యతిరేకత ఉన్న వారి శాతం 4.7గా ఉంది. నిరుడు ఈ వ్యతిరేకత 3.8గా నమోదైంది. విదేశాల నుంచి వచ్చిన వారికి మెల్‌బోర్న్ కన్నా సిడ్నీలో తగిన ఆశ్రయం లభిస్తోంది. మోనాష్ యూనివర్సిటీ కొన్నేళ్లుగా సేకరించిన సమాచారం ఆధారంగా ఈ అధ్యయనం జరిగింది.

సామాజిక సర్వే కోసం 15వేలమందిని ప్రశ్నించిన మీదట జాతి వివక్ష ఎదుర్కొనే వారిలో భారతీయులే ప్రథములని ఈ అధ్యయనం తేల్చింది. 2008లో ఆస్ట్రేలియాలోని భారతీయులపై 17 దాడులు జరగ్గా, 2009లో ఈ సంఖ్య 100కి పెరిగింది.

ఇటీవలి కాలంలో భారతీయ విద్యార్థులపై ఆస్ట్రేలియాలో తరుచుగా జరిగిన విషయం తెలిసిందే. దీంతో భారతీయులు ఆస్ట్రేలియాకు వెళ్లడానికి విముఖత ప్రదర్శిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆస్ట్రేలియాకు చదువుల కోసం వెళ్లే విద్యార్థుల సంఖ్య కూడా తగ్గుతోందని అంటున్నారు. భారతీయులు తమ ఉపాధి అవకాశాలను కొ కొల్లగొడుతున్నారనే అభిప్రాయం స్థానికుల్లో ఉన్నట్లు చెబుతున్నారు.

English summary
According to a survey - Indians are the main target in Australia regarding racial attacks are concerned. A social survey has revealed tha facts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X