చికాగోలో తెలంగాణ ఉత్సవం

రాత్రి భోజనం తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. గణేషుడిని, తెలంగాణ తల్లి ప్రార్థిస్తూ జ్యోతి ప్రజ్వలనం జరిగిన తర్వాత ప్రధాన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మూడున్నర గంటల పాటు నిరంతరాయంగా హంగామా జరిగింది. పిల్లలు, పెద్దలతో పాటు దాదాపు 600 మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
నిరుటి ఉత్సవంలో జై బోలో తెలంగాణ, తెలంగాణ ఉద్యమం ప్రధానం కాగా, ఈ ఏడాది తెలంగాణ సాంస్కృతిక ఉత్సవాలు ప్రధానమయ్యాయి. బోనాలు ఈ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. కాకతీయ ద్వారం, మైసమ్మ కటౌట్లు పెట్టి బోనాల పాటలు పాడుతూ ఉత్సవాన్ని నిర్వహించారు. గానాలాపన, ప్రదర్సనలు జరిగాయి. అమ్మ బైలెల్లిందో నాయనా పాట ఉత్సాహంగా నిలిచింది.
గత ఏడాది కాలంగా చిటా నిర్వహించిన కార్యక్రమాలను వివరించారు. సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్నవారికి ట్రోఫీలు, బహుమతులు అందజేశారు. అజయ్ బొంపల్లి, కిషన్ రెడ్డి, కృష్ణ రంగరాజు, ప్రదీప్ దామిడి, ప్రకాశ్ జలగం, పూర్ణచందర్ అల్లంనేని, రమేష్ కమ్మల, రవి తోకల, శాంతం బోయిన్‌పల్లి, శరత్ కల్వకోట, శరత్ పున్‌రెడ్డి, శ్రీనాథ్ చిన్నల, శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్ ఓరుగంటి, శ్రీరామ్ ఏలేటి, శ్రీధర్ రాజ్, శ్రీనివాస్ పాల్తెపు, తిరుమల్ నెల్లుట్ల, వేణు చలగొండ, వెంకట్ జువ్వాది, దిలీప్ బల్గూరి, ప్రసాద్ బల్గూరి, నితేష్ ఎమ్మిడి, గోపాల్ జనగామ, శ్రీని గోక్ని ఈ కార్యక్రమ నిర్వహణలో ప్రధాన పాత్ర వహించారు.












Click it and Unblock the Notifications