తెలుగు నాటక రంగంపై పరిచయం

మల్లవరపు అనంత్, తియ్యగూర సీతారామిరెడ్డి రచించిన "ధర్మ చేతన" అనే లోతైన కవితని వినిపించారు. సాజీ గోపాల్, బాల గంగాధర్ తిలక్ రాసిన కొన్ని కవితలని విశ్లేషించారు. తదనంతరం నసీం షేక్ వచన కవితకు ఆద్యుడైన కుందుర్తి ఆంజనేయులు కవితా విశేషాలు, జీవిత విశేషాలని సభికులతో పంచుకున్నారు.
ఇటీవల ప్రముఖ సినీ నటుడు, దాదా సాహెబ్ ఫాల్కే బహుమతి గ్రహీత అక్కినేని నాగేశ్వరరావు 75 సంవత్సరాల నాటక, నటనా జీవితం సన్మాన సభా విశేషాలను ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ( టాంటెక్స్) పాలక మండలి ఉపాధిపతి సి ఆర్ రావు సభకు వివరించారు. తరువాత మద్దుకూరి చంద్రహాస్, బెంగాలీ దర్శకుడు సత్యజిత్ రే జీవిత విశేషాలను వేదికకు పరిచయం చేసి “సమైక్య భారతి” సత్యనారాయణ దర్శకత్వం వహించి, నిర్మించిన సత్యజిత్ రే మీద తీసిన ఒక డాక్యుమెంటరీని ప్రదర్శించారు. ఏప్రిల్ 23 తేది సత్యజిత్ రే గారి 20 వ వర్ధంతి అవ్వడం విశేషం.
కార్యక్రమం రెండవ భాగం మల్లవరపు అనంత్ ముఖ్య అతిథి సమైక్య భారతి సంస్థాపకులు గంజి సత్యనారాయణను సభకు పరిచయం చెయ్యడంతో ప్రారంభం అయింది. ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం పూర్వాధ్యక్షులు రుమాళ్ళ శ్యామల ముఖ్య అతిథిని పుష్పగుచ్ఛంతో వేదిక మీదకు ఆహ్వానించారు. తెలుగు నాటక రంగ పరిణామం మీద ‘సమైక్య భారతి’‘ సత్యనారాయణ “తెలుగు నాటకం-నాడు, నేడు” ప్రసంగాన్నిఅందరు ఆసక్తికరంగా విన్నారు. మొదట ఆయన సంస్కృత నాటక పరిణామాన్ని ప్రస్తావిస్తూ తెలుగు నాటకం మీద వాటి ప్రభావాన్నిగురించి ప్రస్తావించారు.
కందుకూరి వీరేశలింగం, చిలకమర్తి లక్ష్మీ నరసింహం, తిరుపతి వేంకట కవులు, కాళ్ళకూరి నారాయణరావు, వేదం వెంకటరాయశాస్త్రి, బలిజేపల్లి లక్ష్మీకాంతం, పానుగంటి లక్ష్మీ నరసింహ శాస్త్రి, ధర్మవరం రామకృష్ణమాచర్యులు రాసిన నాటకాల గురించి క్లుప్తంగా వివరించారు. తొలి నాటక సమాజాలు, నాటకాలని ప్రదర్శించడంలో ఏర్పడిన దళారీ వ్యవస్థ, నాటక పరిషత్తులు, రేడియో నాటకాలు వంటి పలు అంశాల గురించి ఆహూతులకు వివరించారు. చివరిగా ఆధునిక నాటక రంగ విశేషాల వివరణతో సత్యనారాయణ గారి ప్రసంగం ముగిసింది.
తరువాత ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ( టాంటెక్స్) అధ్యక్షులు గీత దమ్మన్న, తానా అధ్యక్షులు తోటకూర ప్రసాద్ ముఖ్య అతిథిని శాలువతో సత్కరించారు. టాంటెక్స్ సాహిత్య వేదిక సభ్యులు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం ,మల్లవరపు అనంత్, డా. జువ్వాడి రమణ, డా.ఊరిమిండి నరసింహా రెడ్డి, మద్దుకూరి చంద్రహాస్ , ప్రవీణ్ బిల్లా, నసీం షేక్ లు ముఖ్య అతిథి ‘సమైక్య భారతి’ సత్యనారాయణగారికి జ్ఞాపిక సమర్పించడంతో కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమానికి ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం పాలక మండలి సభ్యులు మరియు కార్య నిర్వాహక సభ్యులు హాజరయ్యారు.












Click it and Unblock the Notifications