అమెరికాలో తెలుగు వనితా వేదిక

మహిళల సమస్యలనుద్దేశించి వక్తలందరూ చేసిన ఉపన్యాసాలు అందరికీ ఉపయుక్తమైన, ఎంతో విలువయిన సమాచారాన్ని అందించాయి. డా. నిర్మల వల్లూరిపల్లి రొమ్ముకాన్సర్‌కు సంబంధించి తీసుకోవలసిన ముందు జాగ్రత్తల గురించి ప్రస్తావించారు. న్యాయవాది కవిత ఆకుల గృహహింస అన్ని వర్గాల మహిళలూ ఎదుర్కొంటున్న సమస్యగా అభివర్ణిస్తూ కుటుంబ ఆర్థిక వ్యవహారాలు భార్యలకు తెలిసి ఉండవలసిన అవసరాన్ని నొక్కి చెప్పారు.
టాంటెక్స్ కార్యవర్గ నిర్వాహకురాలు రాజేశ్వరి జుజ్జారె స్వచ్ఛంద సేవకురాలిగా తన అనుభవాలు పంచుకున్నారు. ప్రముఖ మానసిక వైద్యురాలు కాంతి రాజు స్త్రీల మానసిక సమస్యలపై మాట్లాడగా, చేతన సంస్థ గృహహింస బాధితులకు అందిస్తున్న సహాయ సహకారాల గురించి ఆ సంస్థ కార్యకర్త మాధవి రెడ్డి వివరించారు. ఆపై జరిగిన ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో సభికులంతా ఉత్సాహంగా పాల్గొని తమ సంశయాలను నివృత్తి చేసుకున్నారు.
అనంతరం కవిత వెంకట్ ఫెంగ్ షుయ్ లోని మౌలిక సూత్రాలు తెలియజేయగా, అన్నపూర్ణ చిలుకూరి,అపర్ణ గంగసాని,స్రవంతి ధగం పలు రకాల ఆవకాయలు ఎలా పెట్టుకోవచ్చో చేసి చూపించారు. సీత ముల్లుకుట్ల తన వీణానాదంతో, శాంత పులిగండ్ల,మధుమతి కృష్ణ తమ గానమాధుర్యంతో సభికులను అలరించారు.వనితావేదిక కమిటీ చైర్ శిరీష బావిరెడ్డి అధ్యక్షతన మంజులత కన్నెగంటి, డా. హిమ రెడ్డి, శారద నంబూరి, మనోజ్ఞ ముద్ద, కల్యాణి తడిమేటి, రేణు చిచ్చుల, శ్రీలక్ష్మి మందిగ నిర్వహించిన ఈ సదస్సులో ఎందరో మహిళలు అత్యుత్సాహంగా పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications