వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్నారైలతో పెళ్లిళ్లు పెటాకులు?

By Pratap
|
Google Oneindia TeluguNews

 NRIs
హైదరాబాద్: ఎన్నారై అబ్బాయిలతో అమ్మాయిల పెళ్లిళ్లు చాలా వరకు పెటాకలవుతున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని మూడింట రెండు వంతుల పెళ్లిళ్లు విడాకులకు దారి తీస్తున్నట్లు ఓ ఆంగ్ల దినపత్రిక వార్తాకథనం తెలియజేస్తోంది. ఎన్నారైలను పెళ్లి చేసుకుని, దెబ్బ తింటున్న అమ్మాయిల్లో ఎక్కువ మంది మధ్యతరగతికి, ఎగువ సామాజిక ఆర్థిక రంగానికి చెందినవారని ఆ పత్రిక రాసింది. పబ్లిక్ కోఆపరేషన్, చైల్డ్ డెవలప్‌మెంట్ నేషనల్ ఇనిస్టిట్యూట్ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం బయటపడింది.

ఆ ఆంగ్ల దినపత్రిక కథనం ప్రకారం - సరళీకృత ఆర్థిక విధానాల నేపథ్యంలో, ప్రపంచీకరణ పుణ్యంతో చాలా మంది స్థానిక యువకులు విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. వారిలో ఎక్కువ మంది ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) రంగంలో పనిచేస్తున్నారు. విదేశాల్లో స్థిరపడిన స్థానిక ఎన్నారైలను, ముఖ్యంగా కంప్యూటర్ ప్రొఫెషనల్స్‌ను అమ్మాయిలు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.

ఉత్తర, దక్షిణ అమెరికాలతో పాటు ఆస్ట్రేలియా, కెనడా, గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న అబ్బాయిలను అమ్మాయిలు వివాహమాడుతున్నారు. పంజాబ్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కేరళలకు చెందిన ఎన్నారైలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. తమ భార్యలను మధ్యలోనే వదిలేస్తున్న ఎన్నారైల సంఖ్య భారతదేశంలో పెరుగుతోందని, ఇది ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువగా ఉందని అధ్యయనంలో తేలింది. దీనికి మతం, ప్రాంతం, కులం వంటి తేడాలు ఏమీ లేవు.

ఎన్నారై భర్తల చేతిలో మోసపోతున్నవారిలో 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు గల మహిళలు 60 శాతం ఉన్నారు. 31 - 35 మధ్య వయస్సు గల మహిళలు 17.6 శాతం ఉన్నారు. ఎన్నారై భర్తలు వదిలేసిన మహిళల్లో 35 శాతం మంది హిందువులు కాగా, 14 శాతం మంది ముస్లింలు, 3 శాతం మంది క్రైస్తవులు ఉన్నారు.

మహిళల్లో 90 శాతం మందికి భర్తలతో వరకట్నం సమస్యను ఎదుర్కుంటున్నారు. భార్యలను ఎన్నారై భర్తలు వదిలేయడానికి ప్రధాన కారణం వరకట్నమే అవుతోంది. కొంత మంది ఎన్నారై యువకులు తాము బడా కంపెనీల్లో పనిచేస్తున్నామంటూ స్థానిక యువతులను మోసం చేసి పెళ్లి చేసుకుంటున్నట్లు తేలింది. కొంత మంది ఇది వరకే పెళ్లి చేసుకున్న విషయాన్ని దాచేసి మళ్లీ ఇక్కడి మహిళలను పెళ్లి చేసుకున్నట్లు కూడా తేలింది. ఎన్నారై భర్తలు ఉద్యోగాలు చేస్తున్నారా, లేదా అనే విషయాన్ని పెళ్లికి ముందు నిర్ధారించుకోలేదని మహిళలు చెప్పారు.

అధ్యయనం చేసిన సంస్థ రాష్ట్రంలోని ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణలకు చెందిన 52 మంది భర్తలతో విడిపోయిన మహిళలను ఇంటర్వ్యూ చేసింది. వీరిలో 21 మందికి విదేశాలకు వెళ్లే అవకాశం కూడా రాలేదట.

English summary
According to media reports - More than two-third of the NRI marriages in the state turned out to be fraudulent matrimonial alliances for the local women resulting in their desertion.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X