అమెరికాలో మహా కుంభాభేషికం
సాన్ జోస్: అమెరికాలోని సాన్ జోస్‌లో గల బాలాజీ ఆలయంలో మే 29వ తేదీ నుంచి జూన్ 2వ తేదీవరకు శ్రీ రుక్మిణి పాండురంగ, శ్రీ షథిర్డీ సాయిబా మహా కుంభాఫేషకం జరుగుతుంది. వేద, ఆగమ శాస్త్రాల ప్రకారం కాలిఫోర్నియాకు చెందిన ప్రముఖ పూజారి, బాలాజీ ఆలయ అధ్యక్షుడు, వ్యవస్థాపకుడు స్వామి ఆనందనాథాజీ కుంభాభిషేకం నిర్వహిస్తారు.
శ్రీ గణపతి పూజ, విశ్వక్షేణ పూజ, పుణ్య వచనం, శుద్ధి, మహా హోమాలను ఈ సందర్భంగా ఆచరిస్తారు. మహా కుంభాభిషేకం సందర్భంగా మే 31వ తేదీన నవ ధాన్యాలు, జలం, క్షీరం, పుష్పాలు వంటి ద్వారా విగ్రహాలను శుద్ధి చేస్తారు. జూన్ 2వ తేదీన మహా కుంభాభిషేకం సందర్భంగా విగ్రహాలను ప్రతిష్టిస్తారు.

వేద పారాయణం, అర్చన, మహా మంగళారతి తర్వాత స్వామీజి కళషాభిషేకం చేస్తారు. అమెరికాలో పాతికేళ్లుగా సేవలు అందిస్తున్న స్వామీజి వార్షికోత్సవాలు జూన్ 1, 2 తేదీల్లో జరుగుతాయి.స్థానిక భారత సంఘాల సహాయంతో జూన్ 1వ తేదీన విజయ్ చవ్వా, ఉమా చింతలపాటి నేతృత్వంలోని తెలంగాణ సాంస్కృతిక సంఘం, దాని బృందం హోమం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తుంది.
స్వామీజి గౌరవార్థం భక్తులు రూపొందించిన సావనీర్‌ను విడుదల చేస్తారు. ఆదివారంనాడు శ్రీనివాస కళ్యాణం, సత్యనారాయణ వ్రతం జరుగుతాయి. ఐదు రోజుల పాటు కార్యక్రమాలు పెద్ద యెత్తున జరుగుతాయి.












Click it and Unblock the Notifications