లండన్‌లో తెలంగాణ కారు ర్యాలీ

లండన్: కాంగ్రెస్ పార్టీ , యూపిఏ ప్రభుత్యం తెలంగాణ ఏర్పాటు దిశ గా తిశుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ తెలంగాణ ఆవిర్భావ దిశగా కేంద్రం అడుగులు వేయడానికి కారణమైన అమరవీరులు, తెలంగాణ ఉద్యమకారుల గౌరవార్ధం తెలంగాణ ఎన్నారై ఫోరం, ఎన్నారై తెరాస విభాగం లండన్‌లో కారు ర్యాలీ నిర్వహించింది.

కేంద్రం తెలంగాణ ఇచ్చే దిశగా ఆశలు చిగురింప చేసి ఉద్యమ కారుల్లో స్ఫూర్తి దాయకమైన పరిణామాలు చోటు చేసుకున్దందుకు వెస్ట్‌ లండన్‌ , సెంట్రల్ లండన్ , ఈస్ట్‌ లండన్‌‌లలో 50 కిలో మీటర్ల కారు ర్యాలి నిర్వహించి అనంతరం ఈస్ట్ లండన్‌లో అమర వీరుల సంస్మరణ సభ నిర్వహించారు.

Car rally in London by Telangana NRIs

ఉదయ్ నాగరాజు అధ్యక్షతన ఈ సభను ప్రారంబించినారు . కార్యక్రమానికి వచ్చిన తెరాస వ్యవస్థాపక సభ్యుడు వి ప్రకాష్ గారు మాట్లాడుతూ - 45 రోజుల్లో రాష్ట్ర ఏర్పాటు జరుగుతుందని , 2 రాష్ట్రాలకు ఇద్దరు గవర్నర్లు ఏర్పడుతారని, ఉమ్మడి రాజధానికి ఎవరికీ ఇబ్బందులు ఉండవని తెలిపారు.

పార్లమెంట్ లో బిల్లు పెట్టె వరకు ఉద్యమం చేయాలని తెరాస ఎన్నారై విభాగం నాయకుడు అనిల్ కూర్మాచలం పిలుపునిచ్చారు. వేయి మంది అమరుల త్యాగఫలితమే రాష్ట్ర ఏర్పాటుకు కారణమని, అది వారికే అంకితమని తెలంగాణ ఎన్నారై ఫోరం వ్యవస్థాపక సభ్యుడు గంప వేణుగోపాల్ అన్నారు. ఈ గౌరవం ఉద్యమాలు చేసిన వారికే దక్కాలని, ఉద్యమాలు చేయకుండా వంట మొత్తం అయ్యాక చివరికి వచ్చి గంట తినేవారికి కాదని సిక్క చందు అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎడ్ల బండి చారిటి , శ్రీకాంత్ పెద్ది రాజు, వసుమల్ల కిరణ్, శివాజీ , వంశీ రెడ్డి, మంద సునీల్, హరి, రోహిత్, సతీష్, నగేష్, చిత్తరంజన్, రంగుల సుధాకర్, శ్రీకాంత్ పెద్దిరాజు, రంగు వెంక‌ట్‌లతో పాటు సుమారు 130 మంది తెలంగాణవారు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+