కారు ప్రమాదంలో ఐదుగురు మృతి

మృతులను పి. పావాయ్ (65), ఆమె కూతుళ్లు ఆర్ సెల్వరాణి (46), ఆర్ గీత (42), ఇద్దరు మనవళ్లు జి. విఘ్నేశ్వరన్ (19), ఎ ఆకాష్ (7)లుగా గుర్తించారు. ఈ మేరకు మీడియాలో వార్తలు వచ్చాయి. బుధవారంనాడు వారు జోహోర్ స్టేట్‌లోని స్కుడాయ్ నుంచి కులైజయకు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.
జాతీయ రహదారికి 17.9 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం సంభవించింది. మృతేదేహాలను వెలికి తీయడానికి ఫైర్, రెస్క్యూ శాఖ అధికారులకు 30 నిమిషాలకు పైగా పట్టింది. తీవ్రంగా గాయపడిన జి. వినీత (16)ను జోహోర్ స్పెషలిస్టు ఆస్పత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చేర్చారు.
ప్రమాదం జరిగినప్పుడు విఘ్నేశ్వరన్ కారు నడుపుతున్నట్లు తెలుస్తోంది. కారు తొలుత ఎడమ పక్కన గల డివైడర్‌ను ఢీకొట్టి, ఆ తర్వాత పిల్లర్‌ను ఢీకొట్టింది. ఏడేళ్ల ఆకాష్ కారు నుంచి బయట పడ్డాడు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications