వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

న్యూయార్క్‌లో ఇండియా పరేడ్ (ఫొటోలు)

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: తెలంగాణ ఎన్నారై సంఘం (తెనా) ఆధ్వర్యంలో న్యూయార్క్ నగరంలో ఉత్సాహభరిత వాతావరణంలో భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు. ఈ నెల 18వ తేదీన న్యూయార్క్ సిటీలో తెలంగాణ సంస్కృతిని, ఉనికిని ప్రతిబింబించే ప్రదర్శన చేశారు. ఇండియా పరేడ్ డే పేరుతో వేడుకలు నిర్వహించారు.

న్యూయర్క్ నగరం చుట్టుపక్కల ఉండే రాష్ట్రాల తెలంగాణ ప్రజలే కాకుండా బోస్టన్, వాషింగ్టన్ డిసి నుంచి కూడా వచ్చి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. దశాబ్దాల పోరాటం, వేలాది మంది యువకుల ప్రాణత్యాగం ఫలితంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయం పట్ల వారు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. జై భారత్ జై తెలంగాణ నినాదాలు గల ప్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ఉత్సవాల్లో పాల్గొన్నారు. నయా భారత్ కోసం నయా తెలంగాణ, ఇండియాను ముందుకు నడిపించడానికి తెలంగాణ ఆవిర్భావం, తెలంగాణ - 29వ రాష్ట్రం ఏర్పడింది, తెలంగాణ అమర వీరులకు జోహార్లు అంటూ నినాదాలు చేశారు.

మహిళలు బోనాలు, బతుకమ్మలను ఎత్తుకున్నారు. బతుకమ్మ పాటలు పాడారు. పురుషులు డప్పులు వాయించారు, నృత్యాలు చేశారు. మొత్తం ప్రదర్శనలో రంగు రంగుల బతుకమ్మలు, బోనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రేక్షకులు చాలా మంది బతుకమ్మల ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు.

రంగు రంగుల బతుకమ్మలు..

రంగు రంగుల బతుకమ్మలు..

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా న్యూయార్క్‌లో తెలంగాణ ఎన్నారైలు ఇండియా డే పరేడ్ నిర్వహించారు. ఈ ప్రదర్శనలో రంగు రంగుల బతుకమ్మలను ఇలా ప్రదర్శించారు. బతుకమ్మ తెలంగాణకే ప్రత్యేకమైన పండుగ.

జై భారత్ జై తెలంగాణ..

జై భారత్ జై తెలంగాణ..

ఇండియా డే పరేడ్‌లో తెలంగాణ ఎన్నారైలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం పట్ల హర్షాతికరేకాలు వ్యక్తం చేశారు. ఈ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకుని జై భారత్ జై తెలంగాణ నినాదాలు చేశారు.

 చిత్రాల ప్రదర్శన..

చిత్రాల ప్రదర్శన..

ఇండియా డే పరేడ్‌లో తెలంగాణ ఎన్నారైలు తెలంగాణకు చెందిన ప్రముఖుల ఛాయాచిత్రాలను ప్రదర్శించారు. బతుకమ్మలతో పాటు ఆ చిత్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చాకలి ఐలమ్మ, పివి నర్సింహారావు చిత్రాలను ఈ చూడవచ్చు.

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో..

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో..

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎన్నారై మహిళలు బతుకమ్మలను పేర్చి, వాటిపై త్రివర్ణ పతాకను అలంకరించి, బతుకమ్మ పాటలు పాడుతూ ఆడారు. ఇది పరేడ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

తెలంగాణ మార్చ్..

తెలంగాణ మార్చ్..

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయానికి ఆనందం వ్యక్తం చేస్తూ తెలంగాణ ఎన్నారైలు న్యూయార్క్‌లో ఇలా జై తెలంగాణ బ్యానర్‌తో మార్చ్ చేశారు.

చార్మినార్ ప్రత్యేకత..

చార్మినార్ ప్రత్యేకత..

ఇండియా డే పరేడ్ కార్యక్రమంలో తెలంగాణ ఎన్నారైలు హైదరాబాద్‌కు ప్రతీక అయిన చార్మినార్ బొమ్మను ప్రత్యేకంగా ప్రదర్శించారు. భారతదేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడుతుందనే ఆనందాన్ని ప్రత్యేకంగా వ్యక్తం చేశారు.

తెలంగాణ సాంస్కృతిక నమూనాలను, ఆదర్శవంతమైన వ్యక్తుల పోస్టర్లను పట్టుకుని చాలా మంది ర్యాలీలో పాల్గొన్నారు. కాకతీయ తోరణం, చార్మినార్, పోచంపల్లి, గద్వాల చీరెలు, పెంబర్తి ఇత్తడి కళాఖండాలను ప్రదర్శించారు. తెలంగాణకు సంపన్నమైన, విశిష్టమైన సాంస్కృతిక వారసత్వం ఉందని, న్యూయార్క్‌లోనూ ప్రపంచంలోని ఇతర ప్రదేశాల్లోనూ దీన్ని ప్రదర్శించడం తమకు గర్వకారణమని తెలంగాణ ఎన్నారై సంఘం చైర్మన్ నారాయణ స్వామి అన్నారు.

సుదీర్ఘ పోరాటం ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్నందున తెలంగాణవాళ్లకు ఇది ప్రత్యేకమైన స్వాతంత్ర్య దినోత్సవమని సంఘం అధ్యక్షుడు వెంకట్ మారోజు అన్నారు. లక్ష్య సాధనలో ప్రాణాలర్పించిన యువతకు ఆయన జోహార్లు ఆర్పించారు. లక్ష్య సాధనకు శాంతియుతంగా, ప్రజాస్వామిక పద్ధతిలో పోరాటం చేసిన కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

ఇండియా డే పరేడ్‌లో పాల్గొన్నందుకు తమకు గర్వకారణంగా ఉందని సంఘం ఉపాధ్యక్షుడు అమర్ కర్మిల్లా అన్నారు. ఇండియా పరేడ్ డే కార్యక్రమాన్ని విజయవంతం చేసినవారందరికీ ఆయన కృతజ్ఝతలు తెలిపారు. కార్యక్రమం విజయవంతం చేయడానికి రవి రవి దన్నపునేని, స్రవంతి పోరెడ్డి, అరవింద్ తక్కలపల్లి, విష్ణు మాధావరం, సుధీర్ రాజు, సుధీర్ బోయినపల్లి, వేణు నక్షత్రం, శ్రవణ్ నాగపూరి విశేషంగా కృషి చేశారు. హరికృష్ణ అందమైన బ్యానర్ డిజైన్లు, ప్రింటింగ్‌ను అందజేశారు.

అందమైన బతుకమ్మలను, బోనాలను తెచ్చిన జమున పుష్కర్, విద్యా వెంకటయోగి, విజయ మారోజు, వినయ సూరినేని, అవంతిక నక్షత్రంలకు ప్రత్యేకంగా కృతజ్ఝతలు తెలిపారు.

English summary
Telangana NRI Association (TeNA), held an impressive display of Telangana culture and identity as a part of India day parade in New York City on August 18th, 2013.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X