భార్యను చంపిన ఎన్నారై అరెస్టు

ఇంటిలో భార్యతో అతను గొడవ పడ్డాడని, ఆ తర్వాత మిత్రుడితో కలిసి భార్యను అతీఫ్ హతమార్చాడని మన్సౌరీ చెప్పారు. మృతురాలిని ముంబైకి చెందిన 23 ఏళ్ల బుష్రాగా గుర్తించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ న్యాయవ్యవస్థపై నమ్మకంతో తాను పోలీసులకు లొంగిపోయినట్లు నిందితుడు చెప్పినట్లు ఆయన తెలిపారు.
భార్య నెలసరి వేతనాన్ని, వార్షిక సెలవు వేతనాన్ని తీసుకున్న తర్వాత అతను భార్యను చంపాడని అంటున్నారు. అతీఫ్ ప్రతి రోజు రాత్రి మిత్రుడిని ఇంటికి తీసుకుని వచ్చేవాడని, ఇద్దరు కలిసి మద్యం సేవించేవారని అంటున్నారు. భర్త తీరుకు ఆమె తీవ్రంగా విసిగిపోయి, అతన్ని నివారించే ప్రయత్నం చేసినట్లు కూడా చెబుతున్నారు.
అతీఫ్ మిత్రుడిని పోలీసులు అరెస్టు చేశారు. మృతదేహాన్ని తరలించడంలో అతీఫ్‌కు సహాయం చేసినట్లు మిత్రుడు అంగీకరించాడు. ఆమె మృతదేహం దుబాయ్ - ఆల్ ఎయిన్ బోర్డర్‌లో దర్శనమిచ్చింది. మార్చి 11వ తేదీ రాత్రి హత్య జరిగింది.












Click it and Unblock the Notifications