• search
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వుమెన్స్ డే: అమెరికాలో అడపపడుచులు

By Pratap
|

చికాగో: ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 23వ తేదీన అమెరికాలో ఆడబడుచులు కార్యక్రమాన్ని తెలుగు అసోసియేషన్ అఫ్ గ్రేటర్ చికాగో, అమెరికా తెలుగు సంఘం (ఆటా) కలిసి సంయుక్తంగా హాలిడే ఇన్ లో నిర్వహించారు. ఆద్యంతం ఆహ్లాదముగా ఉల్లాసంగా జరిగిన ఈ వేడుకలలో అనేకమంది ప్రవాసాంద్ర మహిళలు పాల్గొన్నారు. టిఎజిసి అధ్యక్షుడు రమేష్ గారపాటి, ఆటా అధ్యక్షుడు కరుణాకర్ మాధవరం, స్వాగతోపన్యాసం చేశారు.

జ్యోతి మాధవరం, శిరీష గారపాటి, టిఎజిసి కార్యదర్శి సుజాత అప్పలనేని, ప్రీతి ఆనందుల, మల్లేశ్వరి పెదమల్లు, రాజ్య చెమర్ల తదితరులు జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆసక్తిని ప్రేరేపించే వివిధ అంశాలపై ప్రముఖ వక్తలు పాల్గొని తెలుగు యువతకు ప్రేరణ కలిగించే అంశాలు గురించి చర్చించారు. అమెరికాలో ఉద్యోగాలలో స్త్రీలు ప్రగతి సాదించడం ఎలా అనే అంశం గురించి రంజని ఇఎంగర్, ఇందిరా కౌషిక్ లతో, శ్రీమతి కిరణ్ మట్టే జరిపిన చర్చా గోష్టి అందరినీ ఆకట్టుకుంది.

International Women’s Day Observed by ATA in Chicago

స్త్రీల ఆరోగ్య సమస్యలపై డాక్టర్ మెహర్ మేడవరం, అనేకమైన అంశాల గురించి డాక్టర్ రమా గౌరినేని, అనూపి సింగ్లా ఈ కార్యక్రమంలో ఇచ్చిన ప్రసంగం ప్రేక్షకులని ముగ్దులను చేసింది. చిన్న పారిశ్రామికవేత్తలు రమా భాగవతుల, లక్ష్మి గద్దె, శిరీష గారపాటి లతో శ్రీమతి భార్గవి నెట్టెం నిర్వహించిన చర్చ పలువురి మన్ననలు పొందింది.

ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా శ్రీమతి మాలతి దామరాజు వ్యవహరించారు.

ఈ సందర్భంగా నిర్వాహకులు ధార్మిక సంస్థల కోసం సుమారుగా 20 డబ్బాల ఆహరం సేకరించారు

. ఈ కార్యక్రమం జయప్రదం కావడానికి కారణమైన వందనా రెడ్డి, నందిని కొండపల్లి, సునీత మట్టా, కిరణ్ నూతులపాటి, మాలతి దామరాజు, భార్గవి నెట్టెం, కిరణ్ మట్టే తదితరులను జ్యోతి మాధవరం, శ్రీమతి శిరీష గారపాటి సత్కరించారు.

డల్లాస్‌లోనూ అదే రోజు అమెరికాలో ఆడపడుచులు కార్యక్రమం జరిగింది. ఆటా మాజీ అధ్యక్షురాలు డాక్టర్ సంధ్య గవ్వా స్వాగతం పలికారు. దాదాపు వంద మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆటా చేపట్టిన, చేపట్టే కార్యక్రమాల గురించి ఆమె వివరించారు. ఆటా హెల్త్ కమిటీ చైర్ డాక్టర్ నళినీ రెడ్డి వక్తలను పరిచయం చేశారు.

జ్యోతి జాస్తీ బిజినెస్ లీడర్‌గా తన అనుభవాలను వివరించారు. సాంకేతిర రంగంలో ఎదురయ్యే సమస్యలను ఎలా అధిగమించాలో సూచనలు చేశారు. దైనందిన జీవితంలో ఎదురయ్యే ఒత్తిళ్లను ఎలా అధిగమించాలనే విషయంపై నెఫ్రాలిజిస్టు డాక్టర్ ఉషా పేరి వివరించారు. యోగాను, ప్రాణాయామాన్ని సాధన చేస్తే ఒత్తిళ్లను తట్టుకోవచ్చునని చెప్పారు. డాక్టర్ సురేఖ్ మాచుపల్లి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.

అమెరికా అభిమాన టెలివిజన్ గేమ్‌ను సాయంత్రం ఆడారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. జ్యోతి జాస్తి, కృష్ణవేణి శీలం విజేతలను ఎంపిక చేశారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

lok-sabha-home

English summary

 It was a day to remember for all the women who participated in the International Women's Day which was organized by enthusiastic volunteers of TACG & ATA on March 23rd, 2013 at the Holiday Inn in Mount Prospect, IL. TAGC is a non-profit organization devoted to the awareness and promotion of Telugu Heritage and Culture in the mid-west region headquartered in Chicago. The Association was originally founded in 1971 and incorporated as a non-profit organization by the year 1978. What was once a brain child of small group of individuals, TAGC has grown to be one of the oldest and largest Indo-American organizations in the United States.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more