వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ కోసం ఎన్నారైల సంతకాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
అమెరికా: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ విడుదల కోసం జగన్ కోసం జనం సంతకం పేరు మీద ఎన్నారైలు కూడా సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎన్నారై కన్వీనర్ వెంకట్ మేడపాటి ఓ ప్రకటనలో ఈ విషయం చెప్పారు. యుపిఎ ప్రభుత్వం తన రాజకీయ ప్రత్యర్థులపై పగ తీర్చుకోవడానికి రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు.

రాజకీయ ప్రత్యర్థులను అణచేయడానికి కాంగ్రెసు అధిష్టానం దేశంలో ప్రతి వ్యవస్థను వాడుకుంటోందని ఆయన అన్నారు. తమ చెప్పుచేతల్లో ఉంచకోవడానికి సిబిఐ చేత ములాయం సింగ్ యాదవ్, మాయావతి, ముఖ్యంగా వైయస్ జగన్ వంటివారిపై కేసులు పెట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. జగన్ విషయంలో యుపిఎ ప్రభుత్వం సిబిఐ వంటి ప్రభుత్వ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తోందని అన్నారు.

జగన్ తప్పు చేశారని రుజువు కాకపోయినప్పటికీ గత ఏడు నెలలుగా జగన్‌ను జైల్లోనే ఉంచారని ఆయన అన్నారు. రాజకీయ కక్షతోనే జగన్‌పై సిబిఐ కేసుల వ్యవహారం నడుస్తోందని ఆయన అన్నారు. హెలికాప్టర్ ప్రమాదంలో వైయస్ రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత ఆయన కుమారుడు వైయస్ జగన్ కాంగ్రెసుతో విభేదించడం వల్లనే సిబిఐ చేత దర్యాప్తు చేయించి, కేసులు బనాయించారని వెంకట్ మేడపాటి ఆరోపించారు.

వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో జారీ అయిన 26 జీవోలు కూడా చట్టానికి లోబడే, బిజినెస్ రూల్స్ ప్రకారమే ఉన్నాయని మంత్రులు సుప్రీంకోర్టుకు నివేదించారని ఆయన గుర్తు చేశారు. ప్రాథమిక హక్కులను గౌరవించాలనే విషయాన్ని సిబిఐ విస్మరించడం వల్లనే జగన్ ఇంకా జైలులో ఉండాల్సి వస్తోందని ఆయన అన్నారు. జగన్ కోసం జనం సంతకం పత్రంపై సంతకాలు చేసి జగన్‌కు మద్దతుగా నిలవాలని ఆయన ప్రజలను కోరారు.

English summary
"I submit the following very serious considerations to my esteemed fellow Indians, with great respect, in the belief that this will bring forth to your notice the evidences of gross misuse of the government’s power by the Congress(I) led UPA government of India" says ysr congress NRI convenor Venkat medapati
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X