లండన్‌లో జయశంకర్ జయంతి

లండన్: తెలంగాణా ఎన్నారై ఫోరం, ఎన్నారై టిఆర్యస్ సెల్ సంయుక్తంగా ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి, తెలంగాణా పునర్నిర్మాణ అవగాహనా సదస్సు లండన్ లో ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు రవీందర్ రెడ్డి, ప్రో.జగన్నాధం, నోముల ప్రకాష్, పోచారం సురేందర్ రెడ్డి, హేమంత్ రెడ్డి హాజరయ్యారు.
కార్యక్రమానికి అనిల్ కుర్మాచలం అధ్యక్షత వహించారు.

Jayashankar birth day celebrations in London

అలాగే యుకే నలుమూలల నుండి తెలంగాణా ఎన్నారై ఫోరం, ఎన్నారై టి.ఆర్.యస్ సబ్యులతో పాటు ఇతర తెలంగాణా వాదులు పాల్గొన్నారు. ముందుగా జయశంకర్‌కు, తెలంగాణ ఉద్యమంలో అమరులైన బిడ్డలకు కొవ్వోతులతో నివాళులర్పించి, జయశంకర్ చిత్రపటానికి పూలు సమర్పించి కార్యక్రమాన్ని ప్రారంబించారు.

తరువాత రవీందర్ రెడ్డి గారు మాట్లాడుతూ...జయశంకర్‌తో తనకూ టి.ఆర్.యస్ పార్టీ కి ఉన్న అనుబంధాన్ని, వారి ఆశయాలను సభకు వివరించారు. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు పై ఎవరు ఎటువంటి అనుమానాలు పెట్టుకోవద్దని ఆ ఘట్టం జరిగిపోయిందని, ఇక రాష్ట్ర ఏర్పాటు ఎవరు ఆపలేరని, మనమంతా పునర్నిర్మాణంలో బాగం కావాలని, ముఖ్యంగా ఎన్నారైలు ఆ బాద్యత తీసుకోవాలని అన్నారు.

జగన్నాథం మాట్లాడుతూ...ముఖ్యంగా లండన్ ఎన్నారైల పాత్ర తెలంగాణా ఉద్యమంలో ఎప్పటికి మరువలేనిదని, ప్రపంచంలో ఎక్కడ లేని స్పూర్తి ఇక్కడ ఉందని ప్రశంసించారు. అలాగే జయశంకర్ జీవితం కేవలం తెలంగాణా ప్రజలకే కాదు, వారి వ్యక్తిత్వం ప్రతి మనిషి ఆదర్శమని, జయశంకర్ దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకునాన్నని, మున్ముందు తరాలకు వారి జీవితాన్ని పాట్య పుస్తకాల్లల్లో చేర్చి తెలియజేయాలని అన్నారు.

పునర్నిర్మాణంలో జయశంకర్ విజన్, ప్రతి రంగంలో కోరుకున్న మార్పుల గురించి చక్కగా వివరించి అందరు అందులో బాగస్వాములు కావాలని కోరారు. ఇప్పటి వరకు ప్రత్యక్ష ఉద్యమాల్లో ఉండి, ప్రతి విషయాన్నీ అర్థం చేసుకొని, అవగాహన ఉన్న ఇలాంటి సంస్థలే రేపటి పునర్నిర్మాణం కి కావలసిన విజన్, దీక్ష - దక్షతలు ఉంటాయని, కాబట్టి అందరి కంటే ముందు మీరే ఆ బాధ్యత తీసుకోవాలని అన్నారు.

నోముల ప్రకాష్ మాట్లాడుతూ .... తెలంగాణా రాష్ట్రం ప్రకటించిన సోనియా గాంధీ గారికి కృతఙ్ఞతలు తెలిపారు, అలాగే ముందుకు వెళ్లి పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు పెట్టి ఆమోదింప చేసి నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల దశాబ్దాల న్యాయమైన కోరిక తీర్చాలని కోరారు. అలాగే బవిష్యత్తులో ఎన్నారై సంస్థలు తెలంగాణ లో ఎటువంటి కార్యక్రమం చేపట్టిన తన వంతు బాధ్యతగా పూర్తి సహాయం అందిస్తానని తెలిపారు.

అలాగే తెలంగాణ ఎన్నారై ఫోరం సభ్యులు రంగు వెంకట్, సుహాసిని పునర్నిర్మాణానికి వైద్య విద్య, తదితర అంశాల పైన డాకుమెంట్స్ ద్వార వివరించి సభను ఆకట్టుకున్నారు .ఈ కార్యక్రమానికి తెలంగాణ ఎన్నారై ఫోరం సభ్యులు, ఎన్నారై టి.ఆర్.యస్ సభ్యలతో పాటు ఇతర తెలంగాణ వాదులు బారిగా పాల్గొని విజయవంతం చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+