మాంచెస్టర్‌లో భారత విద్యార్థి అదృశ్యం

Missing student's father reaches Manchester, to help cops
మాంచెస్టర్: భారత విద్యార్థి ఒకరు మాంచెస్టర్‌లో అదృశ్యమయ్యాడు. గత వారం రోజులుగా అతని జాడ తెలియడం లేదు. విద్యార్థి సౌవిక్ పాల్ తండ్రి మాంచెస్టర్ చేరుకున్నాడు. స్థానిక పోలీసులకు సహాయం చేయడానికి అతను యుకెకు వచ్చాడు. తన కుమారుడి సమాచారం ఏమైనా ఉంటే ఇవ్వాలని ఆయన కోరారు.

ఇంగ్లాండులోని మాంచెస్టర్ మెట్రోపాలిటన్ విశ్వవిద్యాలయంలో సౌవిక్ పాల్ చదువుతున్నాడు. సిటీ నైట్ క్లబ్ల్‌లో నూతన సంవత్సర వేడుకలను మిత్రులతో కలిసి చేసుకున్నాడు. అప్పటి నుంచి అతని జాడ కనిపించడం లేదు.

తన కుమారుడి జాడ తెలిసే వరకు తాను దేశాన్ని వదిలిపెట్టేది లేదని సౌవిక్ పాల్ తండ్రి శంతను పాల్ చెప్పారు. సౌవిక్ గురించి ఏ మాత్రం సమాచారం ఉన్నా అతన్ని కనిపెట్టడానికి పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరారు. ఆయన పోలీసు కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

తమ్ముడికి సౌవిక్ పాల్ రోల్ మోడల్ అని చెప్పాడు. చివరి సారిగా డిసెంబర్ 31న తేదీన సౌవిక్ వేర్‌హౌస్ ప్రాజెక్టు వద్ద కనిపించాడు. దాంతో పోలీసు ఈతగాళ్లు మాంచెస్టర్ కాలువల్లో గాలించారు. సౌవిక్ 5 అడుగుల 7 అంగుళాలు ఉంటాడని పోలీసులు చెప్పారు. ఆసియా వర్చస్సు ఉంటుందని అన్నారు.

అతను చివరిసారి చూసినప్పుడు పేల్ డెనిమ్ షర్ట్, గ్రే ట్రౌజర్స్, నేవీ బ్లూ లెదర్ బుట్లు ధరించినట్లు వారు తెలిపారు. అదృశ్యమైన విద్యార్థి జాడపై తమకు రోజురోజుకూ ఆందోళన పెరుగుతోందని గ్రేటర్ మాంచెస్టర్ పోలీసు డిటెక్టివ్ వర్గాలు అంటున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+