ఎంపి మోదుగులకు సన్మానం

మేరీల్యాండ్: అమెరికా లోని మేరిలాండ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు, ప్రముఖ వ్యాపారవేత్త మోదుగుల వేణుగొపాలరెడ్డిని తెలుగు ఎన్నారైలు సత్కరించారు. స్తానిక ప్యారడైస్ ఇండియన్ రెస్తారెంట్‌లో ఎంతో ఆహ్లాదంగా జరిగిన ఈ అత్మీయ సమావేశంలో మోదుగుల మాట్లాడారు. ఎన్నారైలు కూడా రాజకీయాలలోకి రావలసిన అవసరం ఎంతో వుందని, దానివలన దేశానికి ఎంతో మేలు జరుగుతుందని ఆయన అన్నారు.

చంద్రబాబు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఎన్నారైలకు, మరీ ముఖ్యంగా యవతకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చి ప్రపంచ పటంలో ఆంధ్రప్రదేశ్‌కు ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టిందని కొనియాడారు. పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి రాజకీయనాయకుడు ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలను తెలుసుకుని వాటికి తగిన పరిష్కారం చూపించినప్పుడే దేశం, రాష్ట్రాలు బాగా అభివ్రుద్ది చెందుతాయని అన్నారు.

MP Modugula felicitated in USA

ప్రతిరోజు ఎంతో కష్టపడి పనిచేస్తూ, తమకున్న తక్కువ టైం లో కూడా పుట్టిన ఊరికి ఏదో చెయ్యాలనే తపనతో, రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్న ఎన్నారైలంటే తనకు ప్రత్యేకమైన గౌరవమని అన్నారు. శ్రీనివాస్ చందు ఆధ్వర్యంలొ జరిగిన ఈ సమావేశంలో డాక్టర్ జగన్, అన్నపురెడ్డి ప్రసాదరెడ్డి, కొండా రామ్మోహన్, నాగ్ నెల్లూరు, శ్రీధర్ వన్నెంరెడ్డి మోదుగుల చేస్తున్న సేవలను కొనియాడారు.

వెంకటరెడ్డి యర్రం పుష్పగుచ్చంతో స్వాగతం పలకగా, వెంకట్ ఉండమట్ల, రాజేష్ సుంకర, క్రిష్ణ అమృతం, విజయ్ వంగర, ఆనంద్ గుమ్మడి మోదుగుల వేణుగొపాలరెడ్డిని శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. శ్రీరామ కృష్ణయ్య యెల్లెల, ప్రసాద్ నామగిరి పార్లమెంటు సభ్యుడికి అభినందనలు తెలిపారు.

ఇంకా ఈ సమావేశానికి చంద్ర కాటుబోయిన, శివ దట్టి, మారుతి కభంపాటి, సురేష్ నరహరిశెట్టి, అమర్ బొజ్జ, ప్రసాద్ వేదాటి, ప్రవీణ్ కాటంగిరి, హరి కంచెర్ల, వెంకట్ కూకట్ల, శ్రీనివాస్ కూకట్ల, హరిష్ కూకట్ల, విశ్వ ఆలూరి, శ్రీనివాసులు నగరూరు, వెంకట్ వారణాసి, శ్రీనాధ్ కండ్రు, గోపాల్ నున్న, వాసు పుట్టా, రాజశేఖర్ చెరుకూరి లతో పాటు సుమారుగా 150 మంది తెలుగు ఎన్నారైలు హాజరయ్యారు.

చివరగా శ్రీనివాస్ చందు మాట్లాడుతూ - మోదుగుల అమెరికా పర్యటన విజయవంతం కావటానికి అన్ని సహాయ సహకారాలు అందిస్తున్న కిషోర్ వెన్నుపాటి, బుల్లయ్య చౌదరిని అందరికి పరిచయం చేసి, అతి తక్కువ సమయంలో పిలవాగానే వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఝతలు తెలియచేస్తూ వందన సమర్పన చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+