సౌదీలో అనంతపురంవాసి మృతి

మృతదేహాన్ని తెప్పించుకునే మార్గం కూడా కానరాక కుటుంబ సభ్యులు విలవిలలాడుతున్నారు. జలీల్ వృత్తిరీత్యా దర్జీ. స్థానికంగా ఉపాధి అంతంత మాత్రంగా ఉండడంతో సౌదీకి నెల రోజుల క్రితం వెళ్లాడు. గత బుధవారం మసీదులో నమాజ్ చేస్తుండగా స్పృహ తప్పి పడిపోయాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
జలీల్ వెళ్లి నెల రోజులు మాత్రమే కావడంతో తన డబ్బులు పెట్టి మృతదేహాన్ని స్వస్థలం పంపించడానికి యజమాని నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితిలో తోటి వలస భారతీయులు చందాలు వేసుకుని అతని మృతదేహాన్ని శుక్రవారం ఖననం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
మృతదేహం అంత్యక్రియలు కుటుంబ సభ్యులు చూడడానికి వీలుగు ఆన్‌లైన్ ఏర్పాట్లు చేసినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications