వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లండన్‌లో తెలంగాణ సాధన దీక్ష

By Pratap
|
Google Oneindia TeluguNews

NRIs organise Sangheebhava deeksha
ఎన్నారై తెరాస విభాగం ఆధ్వర్యంలో సెంట్రల్ లండన్ లోని నెహ్రు విగ్రహం దగ్గర "తెలంగాణ సాధన దీక్ష" నిర్వహించారు, ఈ దీక్షను టిజెఎసి పిలుపు మేరకు హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న "సమర దీక్ష" కు సంఘీభావంగా ఈ నెల 27వ తేదీన నిర్వహించారు. ఒక పక్క విపరీతమైన మంచు కురుస్తున్నపటికి, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి యుకె నలుమూలలనుండి అధికసంఖ్యలో తెరాస కార్యకర్తలు, తెలంగాణావాదులు. తెలంగాణ ఎన్నారై ఫోరం నాయకులు, సభ్యలు పాల్గొన్నారు.

ఎన్నారై తెరాస సెల్ అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ - ముందుగా ఇంతటి చలిలో, మంచును సైతం లెక్క చేయకుండా ఇందులో బాగాస్వాములైనందుకు, తెలంగాణ పై ఉన్న నిబ్బద్దతకు అందరికి కృతజ్ఞతలు తెలిపారు. ఆజాద్ వ్యాఖ్యలను, తెలంగాణా పట్ల కాంగ్రెస్ అనుసరిస్తున్న వైఖరిని ఖండిస్తూ, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం వెంటనే హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ రాష్ట్ర ప్రకటని చేసి, దాన్ని పార్లమెంట్ లో పెట్టి ఆమోదింపచేయాలని కోరారు.

సీమాంధ్ర నాయకులు ఎన్ని కుట్రలు చేసిన వాటిని ఎదుర్కొని తెలంగాణ సాధించే సత్తా తెలంగాణ బిడ్డలకు ఉందని కాబ్బట్టి ఎప్పటికైన రాష్ట్రం ఏర్పడక తప్పదని కాబట్టి సామరస్యం గా విడిపోయి రెండు రాష్ట్రాలుగా కలిసి ఉందామని కోరారు. మళ్లీ సీమాంధ్ర నాయకుల మాటలకు తలొగ్గి తెలంగాణ ప్రజలను మోసం చేస్తే ఇక కాంగ్రెస్ పార్టీ ని తెలంగాణ లో బూస్థాపితం చేసి, కెసిఆర్ నాయకత్వం లో 15 లోకసభ, 100 కు పైగా శాసనసభ సీట్లను తెచ్చుకొని, యాచించే స్థాయి నుండి శాసించే స్థాయికి ఎదిగి తెలంగాణ సాధించుకుంటామని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రా సాధనకైనా, దాని పునర్నిర్మాణానికైనా తెరాస అధినేత కెసిఆర్ నాయకత్వం మనకు ఎంతో అవసరమని, ఎటువంటి సందర్భమైన దాన్ని బలపర్చాలని కోరారు. తెలంగాణ ఎన్నారై ఫోరం వ్యవస్థాపక సభ్యుడు గంప వేణు గోపాల్ మాట్లాడుతూ - ముందుగా ఇంతటి మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు, తమ సంస్థను బాగాస్వాములని చేసినందుకు ఎన్నారై తెరాస సెల్‌ ను అభినందించారు. టిజెఎసి అనుబంధ ప్రవాస తెలంగాణ సంస్థగా క్షేత్ర స్థాయిలో నిర్వహిస్తున్న అన్ని కార్యక్రమాలకు ఆయన మద్దతు తెలిపారు.
అఖిలపక్షంలో చెప్పినట్టుగా నెలలోపు తెలంగాణ రాష్ట్రంపై కచ్చితమైన అభిప్రాయం చెప్పాలని, అది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియగా ఉండాలని డిమాండ్ చేసారు.

ఇప్పటికే తెలంగాణ తల్లి తన బిడ్డల బలి దానాలతో తల్లడిల్లుతుందని, ఇంకా బరించే శక్తి లేదని, కాబట్టి ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ఇస్తే ఉభయులకు మంచిదని లేని పక్షం లో టిజెఎసి చైర్మన్ కోదండరామ్ అధ్వర్యంలో ఉద్యమ్మాన్ని ఉదృతం చేసి తెలంగాణ సాదించుకుంటామని తెలిపారు.

ఎన్నారై తెరాస విభాగం ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్ శానబోయిన మాట్లాడుతూ - కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని దశాబ్దాల నుండి తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తూనే ఉందని, ఇప్పటికైనా డిసెంబర్ 9 ప్రకటనకు కట్టుబడి వెంటనే తెలంగాణ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఇటువంటి కీలకమైన సందర్భంలో తెలంగాణ శక్తులన్నీ ఏకం కావాలని, అప్పుడే తాము ప్రత్యర్థులను దీటుగా ఎదుర్కో గలమని అన్నారు. ఇది ఒక మతం కులం కోసం జరుగుతున్న పోరాటం కాదని, ఇది ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతున్న పోరాటమని, చివరికి విజం ధర్మానిదేనని తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కీలక దశకు చేరుతునందున, ఈ సమయంలో మనమంతా ఐక్యంగా ఉండి పోరాటాన్ని కొనసాగించాలని, సీమాంధ్ర కుట్రల్ని తిప్పి కొట్టాలని కోరారు, తెలంగాణ వచ్చే వరకు తెరాస అధినేత కెసిఆర్ నాయకత్వంలో ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎన్నారై తెరాస సెల్ లండన్ ఇన్చార్జ్ శ్రీకాంత్ పెద్దిరాజు, సంయుక్త కార్యదర్శులు అశోక్ దూసరి, సిక్క చందు, హరి నవాపేట్, రాజేష్,మల్లారెడ్డి, విష్ణు రెడ్డి, శశిధర్ చేబర్తి, అబూజర్ మొహ్హమద్, వెంకట్ రెడ్డి, నిక్కి రావు, ప్రశాంత్ రెడ్డి, తదితరులు పాల్గొన్న వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఎన్నారై ఫోరం - యుకె శాఖ శాఖ మద్దతు తెలిపింది.

English summary
NRI TRS cell has organised a Tealangana solidarity fast at London in connection with Tealangana Samara deeksha organised in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X