వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో పుచ్చలపల్లి శతజయంతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Puchalapally Sundaraiah
డల్లాస్: ప్రముఖ స్వాతంత్ర యోధుడు, దక్షిణ భారత కమ్యునిస్ట్ పార్టి వ్యవస్థాపకుడు, కులతత్వాన్ని నిరసించిన మానవతావాది, నిత్య అధ్యయనం, నిజాయితీ, నిరాడంబరతకు నిలువెత్తు నిదర్సనంగా జీవించిన ప్రజా నాయకుడుపుచ్చలపల్లి సుందరయ్య శతజయంతిని అమెరికాలోని ఎన్నారైలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం డల్లాస్ సాహితీ మిత్రులు, స్థానిక తెలుగు సంఘాలు కలిసికట్టుగా జనవరి 26వ తేదీన స్థానిక ప్లానో నగరంలోని పార్ గ్రంధాలయంలో శతజయంతి సభను నిర్వహించనున్నట్లు నసీం షేక్ ఓ ప్రకటనలో తెలిపారు.

పార్టీలకతీతం గా, ప్రాంతాలకతీతంగా తెలుగు వారందరూ గర్వించదగ్గ ప్రజా నాయకుడు సుందరయ్య శతజయంతి (1912 - 2012) సభ ను అమెరికాలో కూడా నిర్వహించి, పక్క దారి పట్టిన వర్తమాన రాజకీయాలలో, దార్శనిక రాజకీయాలకు ఆద్యుడు అయినటువంటి సుందరయ్య ఆలోచనల అవశ్యకతను గుర్తు చెయ్యాలన్నదే ఈ సభ ముఖ్య ఉద్దేశమని ఆయన అన్నారు.

"ప్రజా రాజకీయాలలో పుచ్చలపల్లి సుందరయ్య - సమకాలీన భారతదేశం, ప్రపంచంలో పుచ్చలపల్లి సుందరయ్య ఆలోచనలు ఒక పరిశీలన " అన్న అంశంతో నిర్వహిస్తున్న ఈ సభకు ప్రముఖ సీనియర్ పాత్రికేయులు, హేతువాద ఉద్యమ నాయకుడు నరిసెట్టి ఇన్నయ్య ముఖ్య అతిధిగా హాజరవుతారు.

డల్లాస్ సాహితీ మిత్రులు ఉదయ్ భాస్కర్ నందివాడ, చంద్ర కన్నెగంటి, సాజి గోపాల్, కెసి చేకూరి, చంద్రహాస్ మద్దుకూరి, శ్రీమతి శారద సింగిరెడ్డి, అనంత్ మల్లవరపు, రమణ జువ్వాడి గౌరవ అతిధులుగా ప్రసంగించనున్నారు.

గోపినాథ్ పేటేరు, జయ కళ్యాణి, జ్యోతి సాధుల ఆధ్వర్యంలో సుందరయ్య భావాలకు స్ఫూర్తి గా కొన్ని అభ్యుదయ గేయాలాపన కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో డల్లాస్, పరిసర ప్రాంత తెలుగువారందరూ పాల్గొని, జీవితాతంతం ప్రజలపక్షాన నిలబడిన అసలు సిసలు ప్రజాస్వామ్యవాది పుచ్చలపల్లి సుందరయ్యకు ఘన నివాళి అర్పిస్తూ అయన ఆలోచన ల స్పూర్తిగా ప్రజాస్వామ్య పరిరక్షణకు తమ బాధ్యత నిర్వహిద్దామని నసీమ్ షేక్ పిలుపునిచ్చారు.

English summary
Texas literary friends and Telugu associations decided to organize Puchalapally sundaraiah's centebary meeting at Dallas.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X