వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దుబాయ్: పదేళ్ల వాసవి కృప

By Pratap
|
Google Oneindia TeluguNews

దుబాయ్: సరిగ్గా.. ఒక దశాబ్దం క్రితం దుబాయ్‌లో పురుడు పోసుకొందీ ‘వాసవి కృప'.ఈ పదేళ్ళలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. పలుగురి మన్ననలు పొందింది. ఇదే సేవా సంస్థ. పలు సేవా కార్యక్రమాలు చేపట్టింది. త్వరలో దుబాయ్ లో ‘వాసవి కృప' దశాభ్ది ఉత్సవాలను నిర్వహించుకుంటోంది.

వాసవి కృప పేద వైశ్య విద్యార్థుల సహాయార్థం వాసవి కృప సంస్థ పలు సేవా కార్యక్రమాలు అమలు పరుస్తోంది. 2003లో ఈ సంస్థ ఊపిరి పోసుకుంది. భావి భారత మేధావులను తీర్చి దిద్దడం కోసం ఎందరెందరికో ఈ సంస్థ విలువైన విద్యని ఉచితంగా అందజేస్తోంది. సంఘీభావం, సమభావం, సమైక్య భావం అనే నినాదాల స్ఫూర్తిగా భావ సారూప్యత కలిగిన వ్యక్తుల సమష్టి కృషితో సహకారంతో... మానవసేవే మాదవసేవ అనే పారమార్థిక సూక్తికి ఆలంబనగా మున్ముందుకు సాగిపోతోందీ ‘వాసవి కృప'.

ఇప్పటివరకూ వంద మందికి పైగా విద్యార్థులు ఈ సంస్థ ఆర్ధిక సహకారంతో చదువు పూర్తి చేశారు. 2013-14 లో 50 మంది ఆర్య వైశ్య మెరిట్, పేద విద్యార్థులకు ఆర్ధిక సహాయం అందించడానికి ప్రణాళికను సంస్థ సారథులు సిద్ధం చేశారు. ఈ సంస్థ వెబ్ సైట్ ని మంత్రి, ఆర్య వైశ్య ప్రముఖుడు కొణిజేటి రోశయ్య దుబాయ్ పర్యటన సందర్భంగా ప్రారంభించారు

సంస్థలోని ప్రతి సభ్యుడూ తన పరిధిలో వివిధ సేవా కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. భవిష్యత్తులో కూడా తమ సేవా ప్రస్తానం కొనసాగుతుందని, సేవలను మరింత విస్తృత పరుస్తామని ఈ సంస్థ సారథులు చెబుతున్నారు.

దుబాయ్: పదేళ్ల వాసవి కృప

వాసవి కృప కార్యక్రమంలో మంత్రులు టిజి వెంకటేష్, ఏరాసు ప్రతాప రెడ్డి తదితరులు.

దుబాయ్: పదేళ్ల వాసవి కృప

సేవా కార్యక్రమంలో వాసవి కృప సారథులు..

దుబాయ్: పదేళ్ల వాసవి కృప

వాసవి కృప సమావేశంలో తమిళనాడు ప్రస్తుత గవర్నర్ రోశయ్య

దుబాయ్: పదేళ్ల వాసవి కృప

పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందజేస్తూ ఇలా...

దుబాయ్: పదేళ్ల వాసవి కృప

2013-14 లో 50 మంది ఆర్య వైశ్య మెరిట్, పేద విద్యార్థులకు ఆర్ధిక సహాయం అందించడానికి ప్రణాళికను సంస్థ సారథులు సిద్ధం చేశారు.

దుబాయ్: పదేళ్ల వాసవి కృప

వాసవి కృప కార్యక్రమంలో ఇలా..

దుబాయ్: పదేళ్ల వాసవి కృప

వాసవి కృప వనభోజనాల కార్యక్రమంలో ఆట పాటలతో...

దుబాయ్: పదేళ్ల వాసవి కృప

వాసవి కృప నిర్వహించిన వనభోజనాల కార్యక్రమంలో ఉల్లాసంగా.. ఉత్సాహంగా..

దుబాయ్: పదేళ్ల వాసవి కృప

వాసవి కృప వెబ్‌సైట్‌ను ప్రారంభించిన కె. రోశయ్య

దుబాయ్: పదేళ్ల వాసవి కృప

వాసవి కృప కార్యక్రమంలో సినీ నటి కవిత

దుబాయ్: పదేళ్ల వాసవి కృప

వాసవి కృప నిర్వహించిన కార్యక్రమంలో అమ్మాయిల నృత్య ప్రదర్శన.

‘ఆంధ్రప్రదేశ్ నుంచి మంత్రులు టి.జి .వెంకటేష్, తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య, సినీ నటి కవిత లాంటి మహామహులు ఎందరో గతంలో వాసవి కృప' చేపట్టిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. త్వరలో జరగబోయే ఈ దశాభ్ది ఉత్సవాలకు పలువురు ప్రముఖులను కూడా ఆహ్వానిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపాలు.

అత్యంత వైభవంగా జరుగనున్న ఈ వేడుకల్లో అందరూ పాలుపంచు కోవాలని.. మనస్పూర్తిగా ‘వాసవి కృప'. ఆహ్వానం పలుకుతోంది. ఈ దశాబ్ది ఉత్సవ కార్యక్రమాన్ని విజయ వంతం చేయాలని ‘వాసవి కృప' కోరుతోంది.

English summary
A Dubai based organisation Vasavi Krupa has completed 10 years. Several prominent persons have participated in its programs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X