అమెరికా ఎన్నికల్లో గెలిచిన మనోళ్లు..! నీరజ్ రికార్డ్
వాషింగ్టన్: అమెరికా పార్లమెంటు ఉభయ సభలకు జరిగిన మధ్యంతర ఎన్నికల్లో పలువురు భారతీయ అమెరికన్లు గెలుపొందారు. సౌత్ కరోలినా గవర్నర్‌గా నిక్కీ హేలీ వరుసగా రెండోసారి విజయం సాధించారు. హేలీకి 57.8 శాతం ఓట్లు రాగా, ఆమె సమీప అభ్యర్థి డెమోక్రటిక్ అభ్యర్థి విన్సెంట్ షెహీన్‌కు 40 శాతం కన్నా తక్కువ ఓట్లే వచ్చాయి.
సౌత్ కరోలినాకు మొట్టమొదటి మహిళా గవర్నర్ హేలీనే. తాజా విజయంతో రిపబ్లికన్ పార్టీలో జాతీయస్థాయిలో ఆమె పరపతి మరింత పెరిగింది. కాలిఫోర్నియా అటార్నీ జనరల్ కమలా హారిస్ కూడా వరుసగా రెండోసారి విజయం సాధించారు. కొలరాడోలో హౌజ్ 16 డిస్ట్రిక్ట్ నుండి రిపబ్లికన్ అభ్యర్థి జనక్ జోషీ విజయం సాధించారు.

42వ స్టేట్ హౌస్ డిస్ట్రిక్ట్ నుండి 23 ఏళ్ల నీరజ్ ఆంతానీ గెలుపొందారు. అతి చిన్న వయస్సులోనే ఒహియో రాష్ట్ర చట్ట సభకు ఎన్నికైన వాడిగా రికార్డు సృష్టించారు. గత సంవత్సరం ఒహియో స్టేట్ యూనివర్సిటీ నుండి రాజనీతి శాస్త్రంలరో డిగ్రీ పొందారు. ప్రస్తుతం డేటాన్ యూనివర్సిటీలో న్యాయవిద్యను అభ్యసిస్తున్నారు.
కనెటికట్ హౌజ్ 31వ డిస్ట్రిక్ట్ నుండి విశ్రాంత వైద్యుడు ప్రసాద్ శ్రీనివాసన్ రిపబ్లికన్ అభ్యర్థిగా అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిషిగన్ హౌజ్ 69 డిస్ట్రిక్ట్ నుండి సామ్ సింగ్ డెమోక్రాటిక్ అభ్యర్థిగా మళ్లీ గెలుపొందారు. మేరీల్యాండులో హౌజ్ మెజారిటీ నాయకుడు కుమార్ భర్వే, అరుణ్ మిల్లర్ గెలుపొందారు. వాషింగ్టన్ స్టేట్‌లో డెమోక్రాటిక్ అభ్యర్థి పరిమళ జయపాల్ స్టేట్ సెనేట్ స్థానానికి ఎంపికయ్యారు.












Click it and Unblock the Notifications