సైబర్ భద్రతా సదస్సులో 8 ఏళ్ల చిన్నోడి పాఠాలు
న్యూఢిలీ: ఎనిమిదేళ్ల భారత అమెరికన్ బుడతడు హేమాహేమీలకు సైబర్ పాఠాలు చెప్పనున్నాడు. సైబర్ సెక్యూరిటీ మీద అతను ప్రసంగిస్తాడు. ఆ బుల్లోడు ప్రసంగించే సమావేశంలో భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ కూడా ఒక వక్త. శుక్రవారం నవంబర్ 14వ తేదీన గ్రౌండ్ జీరో సమ్మిట్ పేరిట జరిగే సైబర్ సెక్యూరిటీ సమావేశంలో ఎనిమిదేళ్ల రాబిన్ పాల్ ప్రసంగిస్తాడు.
రాబిన్ పాల్ అంటే ఆషామాషీ చిన్నోడు కాడు. ఆరున్నర ఏళ్లకే కంప్యూటర్ లాంగ్వేజెస్ నేర్చుకున్నాడు. ఇప్పుడు సొంతంగా ప్రాజెక్టులు చేస్తున్నాడు. తండ్రి మనో పాల్ శిక్షణలో సి ప్రోగ్రామింగ్ నేర్చుకున్న ఈ బాలుడు, ప్రస్తుత యాపిల్ ఐఓఎస్ ప్లాట్‌పాం మీద స్విఫ్ట్ ప్రోగ్రామింగ్ నేర్చుకుంటున్నాడు.

అంతేకాకుండా, ప్రుడెంట్ గేమ్స్ అనే ఒక కంపెనీకి రాబిన్ సీఈఓ కాగా, తండ్రి మనో పాల్ భాగస్వామిగా ఉన్నారు. ఇదేదో రాబిన్ మొదటి ప్రసంగం అనుకుంటే పొరపాటే. ఇప్పటికే మూడు ప్రసంగాలు చేసిన రాబిన్‌కు ఇది నాలుగో ప్రసంగం. శుక్రవారం నాటి ప్రసంగంలో రాబిన్ పాల్ సైబర్ సెక్యూరిటీ గురించి చెబుతాడు. హ్యాకింగ్ గురించి వివరిస్తాడు.
హూస్టన్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌లో రాబిన కీలకోపన్యాసం చేస్తాడని నిర్వాహకులు చెప్పారు. అతనికి తండ్రి మనో పాల్ అబ్జెక్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో శిక్షణ ఇచ్చాడు. ఆపిల్ ఐఓసి ప్లాట్‌ఫారం కోసం ప్రస్తుతం అతను స్విఫ్ట్ ప్రోగ్రామింగ్ నేర్చుకుంటున్నాడు.
మనోపాల్ ఒడిషాలో పుట్టి పెరిగాడు. 2000ల్లో అమెరికాకు వెళ్లాడు. పిల్లల్లో సైబర్ భద్రతపై చైతన్యం కలిగించాల్సిన అవసరం గురించి రాబిన్ ప్రసంగిస్తాడు. వైట్ పేజ్ హ్యాకింగ్‌పై డెమో ఇస్తాడు.












Click it and Unblock the Notifications