ఐఏఎఫ్‌సి వార్షిక అవార్డుల వేడుక(పిక్చర్స్)
డల్లాస్: 9వ వార్షిక అవార్డుల వేడుకను ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్‌షిప్ కౌన్సిల్(ఐఏఎఫ్‌సి) అమెరికాలోని డల్లాస్‌లో ఘనంగా నిర్వహించింది. శనివారం జరిగిన ఈ కార్యక్రమానికి సుమారు 500 మంది ప్రవాస భారతీయులు హాజరయ్యారు. సౌత్ కరోలినా తొలి భారతీయ అమెరికన్ మహిళా గవర్నర్ నిక్కీ రంధావా హోలే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని కీలక ఉపన్యాసం చేశారు. ప్రత్యేక అతిథిగా ఇర్వింగ్ సిటీ మేయర్ బెత్ వాన్ డూనే హాజరయ్యారు.
ఐఏఎఫ్‌సి సెక్రటరీ రావు కల్వల ప్రారంభోన్యాసం చేశారు. ‘విద్యా - అనుభవం - సాధికారత' అంశాలపై ఆయన క్లుప్తంగా వివరించారు. భారత, అమెరికా జాతీయ గీతాలను చిన్నారులు ఆలపించిన అనంతరం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రముఖ టీవీ యాంకర్, ఐటి ప్రొఫెషనల్ రాజేశ్వరి ఉదయగిరి గురు పరంపర ఆర్ట్స్ స్కూల్ విద్యార్థులను ఆహ్వానించారు. వారు ‘గ్లోరీ ఆఫ్ కూచిపూడి' పేరిట ప్రదర్శించిన నాట్య ప్రదర్శన అహుతులను అమితంగా ఆకట్టుకుంది.
మనూగ్న చావలి, యశస్విని పిండి, పరిమళ గంగరాజు, సంప్రీతి బింగిల నృత్య ప్రదర్శన అలరించింది. ఈ నృత్య ప్రదర్శన రూపకల్పన చేసిన వారు దివంగత పద్మ విభూషణ్ గురు వెంపటి చిన సత్యం, ఆర్ట్స్ స్కూల్ డైరెక్టర్ గురు హేమమాలిని చావలి. ఐఏఎఫ్‌సి డైరెక్టర్ జాన్ హామండ్ మాట్లాడుతూ.. మహాత్మాగాంధీ జీవన శైలి, ఆశయాలు, ఆచరించిన మార్గాలపై కూలంకషంగా వివరించారు. మహాత్మాగాంధీ మెమోరియల్ ప్రాజెక్ట్ గురించిన విషయాలను తెలిపారు. స్థానిక సమస్యలైన విద్యా, ఆహారం, భద్రత, ఆరోగ్యం వంటి అంశాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఐఏఎఫ్‌సి టెక్సాస్ స్టేట్ ఛైర్మన్ డాక్టర్ ప్రసాద్ తోటకూర తెలిపారు.
కరోలినా గవర్నర్ నిక్కీ హోలే, ప్రసాద్ తోటకూర, ఐఏఎఫ్‌సి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు కార్యక్రమంలో విజేతలకు అవార్డులు ప్రదానం చేశారు. ‘ఐఏఎఫ్‌సి-ఔట్‌స్టాండింగ్ స్కాలర్ అండ్ అడ్మినిస్ట్రేటర్' అవార్డును అర్లింగ్టన్‌లోని టెక్సాస్ యూనివర్సిటీ 8వ అధ్యక్షుడు ప్రొఫెసర్ ఖర్బారి ఎం. విస్టస్ప గెలుచుకున్నారు. ‘ఐఏఎఫ్‌సి- కమ్యూనిటీ బ్రిడ్జ్' అవార్డును బెత్ వాన్ డూనే అందుకున్నారు. ‘ఐఏఎఫ్‌సి-ఔట్‌స్టాండింగ్ ఎంటర్‌ప్రిన్యూర్' అవార్డును అలోక్ ఇంటర్నేషనల్ సిఈఓ అరుణ్ అగర్వాల్ గెలుచుకున్నారు.
‘ఐఏఎఫ్‌సి-ఔట్‌స్టాండింగ్ యూత్ ఎక్స్‌లెన్స్' అవార్డును మెడికల్ రెండవ ఏడాది చదువున్న అలీ. ఏ సహెర్వాలా అందుకున్నారు. ఐఏఎఫ్‌సి నిర్వాహకులు తయబ్ కుందవాలా కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు, సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమం చివరలో విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో శాంతి నూతి, సిద్ధ ఎలేశ్వరపు, సిద్ధార్థ ఎలేశ్వరపు, శ్వేత వడ్లమన్నటి, సోనికా రెడ్డి, శ్రియా వస్కర్ల, శ్రేయలక్ష్మి కోడెల, శ్రేయ తాళ్ల, ప్రజ్ఞా బ్రహ్మదేవరా, అభి వడ్లమన్నటి, అఖిల్ ములుకుట్ల, అవని సుంకిరెడ్డిలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తారకుమార్ రెడ్డి, పియూష్ పటేల్, నిరంజన్ త్రిపాఠి, డాక్టర్ సాట్ గుప్తా, పాల్ పాండ్యన్, మురళీ వెన్నమ్, రాజ్ అసావ, రాంకీ చేబ్రోలు, సుస్మిత కోసూరి, అరుణా అగర్వాల్, నిక్ మనేష్, నీహా కుర్తీస్ పాల్గొన్నారు.

ఐఏఎఫ్‌సి అవార్డుల వేడుక
9వ వార్షిక అవార్డుల వేడుకను ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్‌షిప్ కౌన్సిల్(ఐఏఎఫ్‌సి) అమెరికాలోని డల్లాస్‌లో ఘనంగా నిర్వహించింది. శనివారం జరిగిన ఈ కార్యక్రమానికి సుమారు 500 మంది ప్రవాస భారతీయులు హాజరయ్యారు.

ఐఏఎఫ్‌సి అవార్డుల వేడుక
సౌత్ కరోలినా తొలి భారతీయ అమెరికన్ మహిళా గవర్నర్ నిక్కీ రంధావా హోలే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని కీలక ఉపన్యాసం చేశారు. ప్రత్యేక అతిథిగా ఇర్వింగ్ సిటీ మేయర్ బెత్ వాన్ డూనే హాజరయ్యారు.

ఐఏఎఫ్‌సి అవార్డుల వేడుక
కార్యక్రమం చివరలో విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

ఐఏఎఫ్‌సి అవార్డుల వేడుక
ఐఏఎఫ్‌సి సెక్రటరీ రావు కల్వల ప్రారంభోన్యాసం చేశారు. ‘విద్యా - అనుభవం - సాధికారత' అంశాలపై ఆయన క్లుప్తంగా వివరించారు. భారత, అమెరికా జాతీయ గీతాలను చిన్నారులు ఆలపించిన అనంతరం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.












Click it and Unblock the Notifications