NRI News: అగ్నికి ఆహుతైన భారతీయ కుటుంబం..
కువైట్ లో జరిగిన అగ్నిప్రమాదంలో భారతీయ కుటుంబం మృతి చెందింది. ప్రముఖ న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ ఉద్యోగిగా పనిచేస్తూ కువైట్ లో స్థిరపడిన కేరళ వాసి కుటుంబం అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. ఈ అగ్నిప్రమాదం జులై 19న రాత్రి జరిగింది. అయితే అదే రోజు ఆ కుటుంబం వెకేషన్ ముగించుకుని కువైట్ కు వెళ్లైంది. ఇంటికి వెళ్లిన కొన్ని గంటల్లోనే ఘటన జరిగింది.
కేరళకు చెందిన మ్యాథ్యూస్ ములకల్ కువైట్ లో రాయిటర్స్ లో ఉద్యోగం వచ్చింది. దీంతో అతను కువైట్ లోని అబ్బాసియా ప్రాంతంలో ఒక అపార్ట్ మెంట్ ఫ్లాట్ లో నివాసం ఉంటున్నాడు. వారి అపార్ట్ మెంట్ సెకండ్ ఫ్లోర్ లో ఉంటుంది. కేరళలోని అలప్పుళ జిల్లా నీరత్తుపురం ప్రాంతానికి చెందిన ఈ కుటుంబం ఇటీవలే కేరళకు వచ్చి వెళ్లింది. మ్యాథ్యూస్ ములకల్, అతని భార్య లీనీ అబ్రహం తమ ఇద్దరు పిల్లలను తీసుకుని కేరళకు వచ్చారు.

అందరితో కలిసి ఎంజాయ్ చేశారు. జులై 19న సాయంత్రం 4 గంటలకు కువైట్ లోని ఇంటికి చేరుకున్నారు. రాత్రి భోజనం చేసి నిద్రకు ఉపక్రమించారు. ప్రయాణం చేసి అలసిపోవడంతో అందరూ గాడ నిద్రలోకి జారుకున్నారు. రాత్రి 8 గంటల సమయంలో ఏసీలో షార్ట్ సర్క్యూట్ సంభవించింది. క్షణాల్లోనే ప్లాట్ అంత మంటలు వ్యాపించాయి. దీంతో ఇల్లంతా పొగ కమ్మేయడం, బయటకు వెళ్లేందుకు అవకాశం లేకపోవడంతో కుటుంబ సభ్యులంతా ఊపిరి ఆడక ప్రాణాలు విడిచారు.
మ్యాథ్యూస్ ములకల్ 15 ఏళ్లుగా కువైట్ పనిచేస్తున్నట్లు అతని బంధువులు తెలిపారు. అతని భార్య లీనీ స్టాఫ్ నర్స్ గా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇద్దరు పిల్లలను కువైట్ లోని భావన్స్ స్కూల్ చదువుకుంటున్నారు.












Click it and Unblock the Notifications