NRI News: ఎడవొద్దు నాన్న.. నీకు బొమ్ములు తీసుకొస్తా అని చెప్పి అనంతలోకాలకు వెళ్లిన తండ్రి..

అమెరికాలో భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.

కొడుకుకు మందులు, బొమ్మలు తీసుకురావడానికి వెళ్లిన ఓ తండ్రి అనంత లోకాలకు వెళ్లాడు. దీంతో భర్త మరణం, దయనీయ ఆర్థిక పరిస్థితితో భార్య పిల్లలు అంత్యక్రియలకు విరాళాలు సేకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంత బాధలోనూ భర్త కిడ్నీ దానం చేసేందుకు ఆ భార్య ముందుకొచ్చింది. ఈ ఘటన అమెరికాలోని న్సిల్వేనియాలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై స్థానికులు విచారం వ్యక్తం చేశారు.

భారత సంతతికి చెందిన ప్రీతేశ్‌ పటేల్‌ అనే వ్యక్థి 10 ఏళ్లకు పైగా లాంకాస్టర్‌లో నివాసం ఉంటున్నారు. అతనికి భార్య, ముగ్గురు పిల్లలు ఉ్ననారు. అతను అక్కడ చిన్నచిన్న పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం వారు లాంకాస్టర్ నుంచి పెన్సిల్వేనియాలోని డౌఫిన్ కౌంటికి వెళ్లారు. ప్రీతేశ్ పటేల్ అక్కడు జాబ్ కోసం సెర్చ్ మొదలు పెట్టాడు.

A man named Pritesh Patel of Indian origin died in a road accident in America

చిన్న కొడుకుకు టైప్ 1 డయాబెటిస్ ఉండడంతో అతనికి ఇన్సూలిన్, బొమ్మలు కొనడానికి జనవరి 27న ప్రితేశ్ పటేల్ బయటకు వెళ్లాడు. అతను ఇన్సూలిన్, బొమ్మలు కొనుగోలు చేసి వాల్ మార్ట్ వద్ద రోడ్డు దాటుతున్నప్పుడు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఓ కారు అతన్ని బలంగా ఢీకొట్టడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. పోలీసులు అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు.

ఆస్పత్రిలో చికిత్స పొందతూ జనవరి 30న ప్రీతేశ్ పటేల్ మృతి చెందారు. ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉండడంతో ప్రీతేశ్ పటేల్ అంత్యక్రియలు నిర్వహించడానికి భార్య పిల్లలు విరాళాలు సేరించారు. వచ్చిన డబ్బుతో ప్రీతేశ్ పటేల్ దహనసంస్కారాలు నిర్వహించారు. అంతకు ముందు ప్రీతేశ్ పటేల్ కిడ్నీలను స్వచ్ఛందంగా దానం చేశారు. ఈ ప్రమాదనికి కారణమైన కారు డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+