NRI News: దుబాయ్ లాటరీలో 1 మిలియన్ డాలర్లు గెలుచుకున్న తెలుగు వ్యక్తి..
దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో బుధవారం తాజా దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ ప్రమోషన్ కోసం డ్రా నిర్వహించారు. ఈ డ్రాలో ఓ తెలుగు ఎన్నారై 1 మిలియన్ అమెరికన్ డాలర్లు గెలుచుకున్నాడు. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణానికి చెందిన 45 ఏళ్ల కర్ణయ్య మండోళ్ల, దుబాయ్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. మిలీనియం మిలియనీర్ లాటరీలో అతను US$ 1 మిలియన్ గెలుచుకున్నాడు.
అతను అక్టోబర్ 5న ఆన్‌లైన్‌లో టిక్కెట్‌ను కొనుగోలు చేశాడు. "తన పిల్లల చదువుల కోసం డబ్బు ఆదా చేస్తానని. కొంత భాగం దాతృత్వ కార్యక్రమాలకు ఖర్చు చేస్తానని" కర్ణయ్య చెప్పాడు. 1999 నుంచి మిలీనియం మిలియనీర్ ప్రమోషన్‌లో US$1 మిలియన్‌ను గెలుచుకున్న 217వ భారతీయ జాతీయుడు కర్నాయ్ నిలిచాడు. అప్పటి నుంచి భారతీయ జాతీయులు టిక్కెట్‌లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు.

గత ఏప్రిల్ లో హైదరాబాద్ కు చెందిన ఓ అమ్మాయికి దుబాయ్ లాటరీ తగిలింది. ఆమె రూ. 100తో లాటరీ కొనుగోలు చేశారు. ఆమెకు డ్రాలో ఏకంగా రూ. 2.20 కోట్లను గెలుచుకున్నారు. దుబాయ్‌లో హైదరాబాద్ కు చెందిన మహిళ ఇలాంటి లాటరీ గెలవడం ఇజే తొలిసారి. హైదరాబాద్ కు చెందిన హమీద బేగం అనే మహిళ.. అబుదాబిలో రూ. 2.2 కోట్ల రూపాయల లాటరీ గెలుచుకున్నారు.
ఆమె దుబాయ్ లో మూడేళ్లుగా మెడికల్ కోడర్‌గా పనిచేస్తోంది. ఈ క్రమంలో రెగ్యూలర్‌గా ఓ సంస్థ నిర్వహించే లాటరీలో.. రూ. 100తో టికెట్ కొనుగోలు చేసింది. దీంతో ఆమెకు ఊహించన విధంగా డ్రాలో తన నంబర్ గల లాటరీకి 2.2 కోట్లు రూపాయలు వచ్చాయి.












Click it and Unblock the Notifications