NRI News: యూఏఈ నుంచి ఇండియాకు వస్తున్నారా.. అయితే మీకు జేబుకు చిల్లే..!
రంజాన్ సందర్భంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి భారత్ వచ్చే విమాన ఛార్జీలు పెరిగే అవకాశం ఉంది.
భారత్ నుంచి చాలా మంది ఉపాధి కోసం ఇతర దేశాలు వెళ్తుంటారు. కొంత మంది అక్కడే సెటిల్ కాగా మరికొందురు వస్తూ వెళ్తుంటారు. భారత్ నుంచి ఎక్కువగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వెళ్తుంటారు. మరి ముఖ్యంగా కేరళ, తెలంగాణ నుంచి అధిక సంఖ్యలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వెళ్తారు. అయితే చాలా మంది రంజాన్ సందర్భంగా ఇండియాకు వస్తుంటారు.
ఈ రంజాన్ మాసంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సెలవులు ఇస్తారు. దీంతో చాలా మంది భారతీయులు ఇండియాకు వస్తారు. ముఖ్యంగా ఈ రంజాన్ ముస్లింలకు చాలా పెద్ద పండుగ కాబట్టి వారు తప్పని సారిగా ఇండియాకు వస్తారు. ఇలా వచ్చే వారికి ఈసారి ఖర్చు కాస్త ఎక్కువ కానుంది. ఎందుకంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) నుంచి భారత్ కు వచ్చే విమాన ఛార్జీలు పెరిగే అవకాశం ఉంది.

మార్చి 23 నుంచి ప్రారంభమయ్యే రంజాన్ మాసం నుంచి విమాన ఛార్జీలు 10 నుంచి 25 శాతం వరకు పెరుగుతాయని స్థానిక మీడియా పేర్కొంది. పండుగ దగ్గర పడేకొద్ది మరింత ఛార్జీలు పెరిగే అవకాశం ఉంది. కాగా గత రెండు సంవత్సరాలుగా కొవిడ్ తో నెమ్మదించిన విమాన ప్రయాణాలు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి.
గల్ఫ్ న్యూస్ నివేదిక ప్రకారం, మార్చి 21 నుండి 30 వరకు, UAE నుండి భారతదేశానికి ఒక రౌండ్-ట్రిప్ ఎకానమీ టిక్కెట్ల ధర సుమారు 1,316 దిర్హామ్‌లు (రూ. 29,710) ఉండే అవకాశం ఉంది. గతంలో వచ్చిన నష్టలను రికవరీ చేసుకునేందుకు విమానయాన సంస్థలు ధరలు పెంచే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications