NRI News: లండన్ లో రోడ్డు ప్రమాదం.. భారతీయ విద్యార్థి మృతి..
ఇంగ్లాండ్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతీయ విద్యార్థి మృతి చెందింది. పరిశోధక విద్యార్థి చెయిస్తా కొచ్చర్ లండన్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆమె వయస్సు 33 సంవత్సరాలుగా ఉంది. చెయిస్తా కొచ్చర్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో పీహెచ్డీ చేస్తున్నారు. కొచ్చర్ మంగళవారం కాలేజీ నుంచి సైకిల్ పై సెంట్రల్ లండన్ కు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఆమె సైకిల్ పై వెళ్తున్న క్రమంలో ఓ ట్రక్క్ వేగంగా వచ్చి ఆమెను ఢీకొట్టింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి.
భారీగా రక్తస్రావరం కావడంతో కొచ్చర్ అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో కొచ్చర్ స్నేహితులు కొచ్చర్ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. చెయిస్తా కొచ్చర్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు ఆమె తండ్రి రిటైర్డ్ లెఫ్ట్నెంట్ జనరల్ ఎస్పీ కొచ్చర్ తెలిపారు. ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కొద్ది రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో తన కూతురు చెయిస్తా కొచ్చర్ మృతి చెందారని చెప్పారు. ఆమె మరణం స్నేహితులు, కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదాన్ని నిపిందన్నారు.

తాను చెయిస్తా కొచ్చర్ మృతదేహాన్ని భారత్ కు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు లింక్ డిన్ లో ఎస్పీ కొచ్చర్ తెలిపారు. చెయిస్తా కొచ్చర్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంపై నీతి ఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్ కాంత్ మాట్లాడారు. కొచ్చర్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. చెయిస్తా ఎంత ధైర్యం గల అమ్మాయని చెప్పారు. కొచ్చర్ నీతి ఆయోగ్ యూనిట్ లో తనతో కలిసి పని చేసినట్లు గుర్తు చేశఆరు. ఆమె చిన్న వయస్సులోనే మృతి చెందడం చాలా బాధాకరమని అమితాబ్ కాంత్ చెప్పారు.
ఆమె ఆత్మకు శాంతి చేకూరలని కోరుకున్నాడు. చెయిస్తా కొచ్చర్ 2023 సెప్టెంబర్ లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో ఆర్గనైజేషనల్ బహేవియర్ మేనేజ్ మెంట్ లో పీహెచ్డీ చేయడానికి లండన్ వెళ్లినట్లు ఆమె బంధువులు తెలిపారు. చెయిస్తా కొచ్చర్ 2021 నుంచి 2023 మధ్య నీతి ఆయోగ్ లో బిహేవియరల్ యూనిట్ ఆఫ్ ఇండియాలో సీనియర్ అడ్వైజర్ గా పని చేశారు.












Click it and Unblock the Notifications