విభజన: కళ్లలో నీళ్లు వచ్చాయి

An NRI vents his feelings on bifurcation of AP
నేను పక్కా సమైక్యవాదిని... తెలుగుజాతి విడిపోతుంది అని బాధగా ఉన్నా ఒక్క విషయం అయితే చెప్పగలను...

రాష్ట్ర విభజన వల్ల సీమాంధ్ర ప్రాంతం ఒక 10సంవత్సరాలు ఇబ్బంది పడవచ్చేమో గానీ ఆ తర్వాత దేశంలోనే అగ్రగామిగా ఉంటుందని అనడంలో ఎలాంటి సందేహం లేదు... ఛీ.. ఛీ.. ఏం రాజకీయాలు ? ఏమి రాజకీయ నాయకులండీ వీళ్ళు ? అసలు ప్రజాస్వామ్యం ఉందా ? ఓటు వేయాలంటేనే అసహ్యం వేస్తోంది?

నాకే తెలియకుండా నా కళ్ళవెంట నీళ్ళు వచ్చాయి.... 60 సంవత్సరాల పోరాటానికి ఫలితంగా తెలంగాణ వచ్చినందుకు సంతోషించాలో? ఏ పాపం తెలియని ఆంధ్ర ప్రజలు బలి అయినందుకు బాధ పడాలో తెలియటం లేదు. సామాన్య ప్రజలకు ఏం పని చేసారండి ఈ రాజకీయ నాయకులు ? స్వార్ధంతో వాళ్ళు బాగు పడటం, హైదరాబాద్ నీ బాగు చేయటం తప్పా? ఆంద్ర, తెలంగాణ, రాయలసీమ జిల్లాలలో ఏ జిల్లా చూసినా ఏదీ బాగుపడలేదు, అసలు ప్రజాస్వామ్యం ఉందా ? అని ఈ రోజు అనుమానం వస్తుంది, సమస్యలకు పరిష్కారం చూపకుండా, వేరే రాష్ట్రం ఇచ్చారు ... స్వార్థం ..స్వార్ధం...స్వార్ధం... అన్ని రాష్ట్రాల ప్రజలను రిక్వెస్ట్ చేస్తున్నాను... రాజకీయ నాయకులను చూసి గొప్ప అనుకోవద్దు ... వాళ్ళు ప్రజల పనివారు .. వారు పని చేయకపోతే నిలదీయండి ? ఇప్పటికైనా కళ్ళు తెరవండి ?...

తెలంగాణ రాష్ట్రం వచ్చేసింది కాబట్టి అన్నీ సాధించేశామని అనుకుంటే అది మీ అవివేకం అవుతుంది... తెలంగాణ ప్రజలకు అసలైన సవాలు ఇప్పటినుంచే ప్రారంభం అవుతుంది... తెలంగాణ ప్రజలు ఏ మాత్రం అప్రమత్తంగా లేకపోయినా తెలంగాణలో భూస్వాములు, పెత్తందారులు పెచ్చరిల్లిపోయే ప్రమాదం లేకపోలేదు... తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా లేకపోతే తెలంగాణ రాష్ట్రం మనుగడ సాధించడం కష్టం...

రాష్ట్ర విభజన కోరుకొని తప్పు చేసామని ప్రతి ఒక్క వేర్పాటువాది బాధపడే రోజు వస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నాను...

ఆంద్ర ప్రజలకు న్యాయం జరగాలని కోరుకుంటూ ....

- జూలూరు సురేష్, ఎన్నారై, దుబాయ్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+