వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అనిల్‌కు పదవీ ప్రవాసులకు దక్కిన గౌరవం: నందిని అబ్బగౌని

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్ర చలన చిత్రాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా ఎన్నారై అనిల్ కుర్మా చలం నియమించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వానికి తెలంగాణ జాగృతి ఖతార్ అధ్యక్షురాలు నందిని అబ్బగౌని కృతజ్ఞతలు తెలియజేశారు. పదవీ భాద్యతలు స్వీకరించిన అనిల్ కూర్మాచలంను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనిల్‌కు పదవీ రావడం పట్ల తెలంగాణ ఎన్నారై సమాజం హర్షం వక్తం చేస్తుందని ఆమె పేర్కొన్నారు.

ఉద్యమ సమయం నుంచి ఖండాంతరాలలో తెలంగాణ వాదాన్ని అనిలా వినిపించారు. అందుకే పదవీ లభించిందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఎన్నారైలను అభివృద్ధిలో భాగస్వాములు చేస్తుందని తెలిపారు. ప్రవాసుల సంక్షేమానికి నిర్దిష్ట ప్రణాళిక తో చర్యలు తీసుకోవాలని కోరారు. గల్ఫ్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.

anil post is respect to nri:nandini abba gouni

తెలంగాణ రాష్ట్ర చ‌ల‌న‌చిత్ర‌, టీవీ, థియేట‌ర్స్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ చైర్మన్‌గా ఎన్నారై టీఆర్ఎస్ సెల్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కుర్మాచ‌లం ఆదివారం బాధ్యతలు స్వీక‌రించిన సంగతి తెలిసిందే. అనిల్ కూర్మాచలం పవీ స్వీకరించడంపై ఎన్నారై టీఆర్ఎస్ సెల్ బహ్రెయిన్ శాఖ హర్షం వ్యక్తం చేసింది. కేక్ కట్ చేసింది.

anil post is respect to nri:nandini abba gouni

టీఆర్‌ఎస్‌ సెల్ అధ్యక్షుడు రాధారపు సతీష్ కుమార్, ఉపాధ్యక్షుడు వెంకటేష్ బొలిశెట్టి మాట్లాడుతూ.. అనిల్‌ కుర్మాచలానికి పదవీ ఇవ్వడం ప్రతి ప్రవాసీ బిడ్డకు దక్కిన గౌరవం అన్నారు. అనిల్‌ తెలంగాణ వాదాన్ని ఖండాంతరాలలో టీఆర్‌ఎస్‌ ఎన్నారై విభాగాన్ని స్థాపించి కేసీఆర్‌ నాయకత్వంలో బలంగా వినిపించారన్నారు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి టీఆర్ఎస్ పార్టీకి ఒక సైనికుడిగా పనిచేశారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి పుప్పాల లింబాద్రి, మగ్గిడి రాజేందర్, అన్నారం సుమన్, కార్యదర్శులు సంగేపు దేవన్న, చెన్నమనేని రాజేందర్, ఉత్కం కిరణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

English summary
anil kurmachalam nominate to Film Development Corporation chairman post. this is respect to nris nandini abbagouni said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X