వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వృద్ధుల కోసం ‘అన్నదాత’ సేవలు (పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లోని పేద వృద్ధుల కోసం అమెరికాలోని ఎన్నారై సేవా సంస్థ అన్నదాత చారిటీస్ లిమిటెడ్ పలు సేవా కార్యక్రమాలను చేపడుతోంది. టెక్సాస్‌లోని ఇర్వింగ్ నగరంలోని పసంద్ ఇండియన్ రెస్టారెంట్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అన్నదాత అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి పడాల సేవా కార్యక్రమాలకు సంబంధించిన నిధులను సమీకరించారు. బోర్డ్ ట్రస్టీ రాజా రెడ్డి, అన్నదాత సెక్రటరీ వీర చింతా అమెరికాలోని ప్రవాసాంధ్రులను కార్యక్రమానికి ఆహ్వానించారు.

భారతీయ అమెరికన్ సంఘ నాయకులు డాక్టర్ ప్రసాద్ తోటకూర తోపాటు ఇతర ఆహ్వానితులను శిరీష్ రెడ్డి, ప్రసాద్ గుజ్జులు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. సరోజారెడ్డి చేసిన ప్రార్థనతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రసాద్ గుజ్జు మాట్లాడుతూ.. సంస్థ గురించి తెలుపుతూ, చేపటనున్న సేవా కార్యక్రమాల గురించి హాజరైన ఆహ్వానితులకు వివరించారు.

ప్రస్తుతానికి రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలోని పిట్టల వేమవరం, అన్నవరపాడు గ్రామాల్లోని బీద వర్గానికి చెందిన వృద్ధులకు ఆహార ధాన్యాలు అందించినట్లు తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలను మరిన్ని గ్రామాల్లో కూడా అందించనున్నట్లు తెలిపారు. మరుటేరు, కవితం, పెనుగొండ, నెగ్గుపుడి, వెలగలేరు, సత్యవరం గ్రామాల్లోని సుమారు 40 మంది వృద్ధులకు ఆహారధాన్యాలను అందించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమాలకు గ్రామల్లోని ప్రజల నుంచి పూర్తి మద్దతు లభించినట్లు ఆయన తెలిపారు.

ప్రసాద్ తోటకూరతో సభ్యులు

ప్రసాద్ తోటకూరతో సభ్యులు

అమెరికాలోని టెక్సాస్‌లోని ఇర్వింగ్ నగరంలోని పసంద్ ఇండియన్ రెస్టారెంట్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అన్నదాత అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి పడాల సేవా కార్యక్రమాలకు సంబంధించిన నిధులను సమీకరించారు. వీర చింతా, రాజా రెడ్డి, డాక్టర్ ప్రసాద్ తోటకూర, భాస్కర్ రెడ్డి, ప్రసాద్ గుజ్జు, సుధీర్ మేడపాటిలు పాల్గొని ప్రసంగించారు.

సేవా కార్యక్రమాల వివరణ

సేవా కార్యక్రమాల వివరణ

అమెరికాలోని టెక్సాస్‌లోని ఇర్వింగ్ నగరంలోని పసంద్ ఇండియన్ రెస్టారెంట్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అన్నదాత అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి పడాల సేవా కార్యక్రమాలకు సంబంధించిన నిధులను సమీకరించారు. కార్యక్రమంలో వీర చింతా, భాస్కర్ రెడ్డి, డాక్టర్ ప్రసాద్ తోటకూర పాల్గొన్నారు. భాస్కర్ రెడ్డి ప్రసంగం.

పుష్పగుచ్ఛంతో స్వాగతం

పుష్పగుచ్ఛంతో స్వాగతం

అమెరికాలోని టెక్సాస్‌లోని ఇర్వింగ్ నగరంలోని పసంద్ ఇండియన్ రెస్టారెంట్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అన్నదాత అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి పడాల సేవా కార్యక్రమాలకు సంబంధించిన నిధులను సమీకరించారు. హాజరైన ప్రముఖులకు పుష్పగుచ్ఛంతో స్వాగతం పలుకుతున్న దృశ్యం.

నర్సింహారెడ్డి ప్రసంగం

నర్సింహారెడ్డి ప్రసంగం

అమెరికాలోని టెక్సాస్‌లోని ఇర్వింగ్ నగరంలోని పసంద్ ఇండియన్ రెస్టారెంట్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అన్నదాత అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి పడాల సేవా కార్యక్రమాలకు సంబంధించిన నిధులను సమీకరించారు. కార్యక్రమంలో మాట్లాడుతున్న డాక్టర్ నర్సింహారెడ్డి ఉరిమిడి.

అమెరికాలోని డల్లాస్‌లోని నేపాలీ, భూటాన్ దేశాలకు చెందిన 50మంది శరణార్థులకు కూడా ఆహార ధాన్యాలను అందించినట్లు ప్రసాద్ తెలిపారు. తాము చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలకు స్వచ్ఛందంగా సహకరించాలని ఆయన కోరారు. భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లోని బీద వర్గాలు ప్రస్తుతం జీవించేందుకు తీవ్ర పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని డాక్టర్ ప్రసాద్ తోటకూర అన్నారు. ముఖ్యంగా వృద్ధులు ఆహార ధాన్యాల కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

అన్నదాత సంస్థ బీద వర్గాల వృద్ధులకు అందిస్తున్న సహాయం పట్ల ప్రసాద్ తోటకూర నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు తాము అందిస్తున్న సేవా కార్యక్రమాలు, నిధుల సమీకరణ వంటి అంశాలపై హాజరైన ఎన్నారైలకు వివరించారు. సంస్థ కార్యక్రమాలకు అధికమొత్తంలో సహాయం చేసేందుకు ముందుకు వచ్చిన డాక్టర్ రాజేందర్ సింగ్ చౌహాన్, శ్రీనివాస్ రెడ్డి కోనలకు నిర్వాహకులు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు.

కార్యక్రమానికి హాజరైన వారందరికీ అన్నదాత అసిస్టెంట్ సెక్రటరీ సుధీర్ మేడపాటి కృతజ్ఞతలు తెలిపారు. 20 మంది శాశ్వత దాతలను కలిగి ఉన్న అన్నదాత సంస్థ ప్రతీ ఏడాదికి సుమారు 29మంది వృద్ధులకు సహాయం చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమానికి సుమారు వందమందికి పైగా ఎన్నారైలు పాల్గొని, స్వచ్ఛందంగా అన్నదాత సంస్థకు సహాయం అందించారు.

English summary
Annadhata Charities Ltd., is a registered non-profit charitable organization in USA is dedicated to assist senior citizens who are unable to support themselves in rural areas of Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X