NRI News: లండన్‍లో హత్యకు గురైన భారత సంతతి వ్యక్తి.. భారతీయులను కలవరపరుస్తున్న వరుస హత్యలు..

బ్రిటన్ భారత సంతతి హత్యకు గురయ్యాడు. తెలంగాణ అమ్మాయి తేజస్విని హత్య మరవకముందే ఈ హత్యం జరగడం ఆందోళన కలిగిస్తోంది. దక్షిణ లండన్‌లోని అపార్ట్‌మెంట్ బ్లాక్ వెలుపల 38 ఏళ్ల భారతీయ సంతతి వ్యక్తి కత్తిపోట్లకు గురై మరణించాడు.

మృతి చెందిన వ్యక్తిని అరవింద్ కుమార్ గా గుర్తించారు. అరవింద్ ను అతనితో ఉంటే సలీం అనే వ్యక్తి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. సలీంను శనివారం క్రోయిడాన్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. అతనికి మేజిస్ట్రేట్ జూన్ 20 వరకు పోలీసు కస్టడీ విధించారు.

Another man of Indian origin was murdered in London

సలీం, అరవింద్ ఇద్దరు కేరళకు చెందినవారు. సలీంను మంగళవారం లండన్‌లోని ఓల్డ్ బెయిలీ కోర్టులో హాజరుపరుచనున్నారు. "సౌతాంప్టన్ వేలోని అరవింద్ అనే వ్యక్తి తన నివాసం వెలుపల కత్తిపోట్లకు గురయ్యాడు. తర్వాత జూన్ 16, శుక్రవారం మధ్యాహ్నం 01:27 గంటలకు (స్థానిక కాలమానం) పోలీసులను అతని గుర్తించారు" అని పోలీసులు చెప్పారు. అరవింద్ ను అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నం చేసినప్పటికీ అతను అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు.

జూన్ 16, శుక్రవారం నిర్వహించిన పోస్ట్‌మార్టం పరీక్షలో అతను ఛాతీపై కత్తిపోటు కారణంగా మరణించాడని వైద్యులు నిర్ధారించారు. అరవింది చనిపోయిన విషయాన్ని వారి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. "సౌతాంప్టన్ వే/కోల్‌మన్ రోడ్‌లో భయంకరమైన హత్య. మృతుల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి. ఇది ఎవరు చేసినా వారికి న్యాయం చేయడంలో సహాయపడే ఏదైనా సమాచారం మీ వద్ద ఉంటే పోలీసులను సంప్రదించండి" అని పెక్‌హామ్‌కి లేబర్ పార్టీ ఎంపీ హ్యారియెట్ హర్మాన్ ట్వీట్ చేశారు.

ఇటీవలి కాలంలో యూకేలో కత్తి పోట్లు పెరుగుతున్నాయి. జూన్ 19న భారతీయ మూలాలున్న గ్రేసి ఓమెలిపై కత్తితో దాడి హత్య చేశారు. ఆ తర్వాత హైదరాబాద్ చెందిన తేజస్విని బ్రెజిల్ కు చెందిన వ్యక్తి కత్తితో పొడిచి హత్య చేశాడు. ఇదే ఘటనలో మరో భారత విద్యార్థి అఖిల తీవ్రంగా గాయపడ్డారు. ఈ వరుస ఘటనలో భారతీయులను భయాందోళనకు గురయ్యేలా చేస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+