తానా సభల వేళ: చంద్రబాబు సన్నిహితుడిపై వేటు: జగన్ కీలక నిర్ణయం..!
అమెరికాలో తానా సంబరాలు అరంభం అవుతున్న వేళ ఏపీ ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ లో ఎన్నారై వ్యవహారాల్లో కీలకంగా వ్యవహిరించే వ్యక్తి మీద వేటు వేసారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆయన అత్యంత సన్నిహితుడు. చంద్రబాబు లేదా ఆయన కుమారుడు అమెరికాలు కాలు పెడితే ఆయనకు స్వాగతం దగ్గర నుండి అన్ని కార్యాక్రమాలు మొత్తం పర్యవేక్షించారు. ఇక..అమెరికాలో తెలుగు వారు తానా మహాసభల పేరుతో ఉత్స వాలు జరుపుకుంటున్న వేళ..జగన్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో..ఇప్పుడు ఈ వ్యవహారం అధికార వర్గాల్లో నే కాదు..రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

కోమటి జయరాంపై వేటు..
అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి హోదాలో ఉన్న కోమటి జయరాం పైన జగన్ ప్రభుత్వం వేటు వేసింది. టీడీపీకి అత్యంత సన్నిహితుడు అయిన జయరాం టీడీపీ హయాంలో అమెరికా వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు ..లోకేశ్ తో పాటుగా టీడీపీ నేతలు ఎవరు అమెరికా వచ్చినా ఆయన వారికి అతిధ్యం అందించటం మొదలు అక్కడ అన్ని కార్యక్రమాలు పర్యవేక్షించేవారు. తెలుగువారికి సంబంధించిన సభలు ఏమైనా జరిగినా వీటన్నింటినీ జయరామే దగ్గరుండి చూసుకునే వారు. ఆయనకు చంద్రబాబు ఏరి కోరి తన హాయంలో అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి హోదా కల్పించారు. ఆయనతో పాటుగా వేమూరి రవి ప్రసాద్ సైతం ఎన్నారైల వ్యవహారాలను చంద్రబాబుక అనుకూలంగా చక్కబెట్టేవారు. ఆయనకు ఏపీ ఎన్నార్టీ ఛైర్మన్ పదవిని నాడు చంద్రబాబు అప్పగించారు. ఇక, ఇప్పుడు జగన్ అధికారంలోకి రావటంతో కోమటి జయరాంను ఆ పదవి నుండి తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

తానా సభలు జరుగుతున్న వేళ..
అమెరికాలో తానా మహాసభలు ప్రారంభం అవుతున్నాయి. ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో జరిగే ఈ సభలకు ఏపి-తెలంగాణ నుండి ప్రముఖులు ఇప్పటికే తరలి వెళ్లారు. జనసేన అధినేత పవన్ కళ్యాన్‌ను సైతం తానా ప్రతినిధులు ఆహ్వానించారు. అదే విధంగా తెలంగాణ మంత్రులు..టీడీపీలో ప్రముఖులు ఇప్పటికే అమెరికాకు చేరు కున్నారు. వీరందరికీ తానా సంఘం ప్రత్యేక గుర్తింపు ఇవ్వనుంది. ఇదే సమయంతో తానాలో పెద్ద తలకాయ గా ఉండే కోమటి జయరాంను తప్పిస్తూ జగన్ ప్రభుత్వం నిర్ణయం ప్రకటించింది. ఉద్దేశ పూర్వకమో..యాధృచ్చికమో కానీ కోమటి జయరాంను ఈ రోజనే తప్పిస్తూ నిర్ణయం తీసుకోవటం పైన చర్చ సాగుతుంది. తానాకు కోమటి జయరాం సుదీర్ఘ కాలం అధ్యక్షుడిగా పని చేసారు. ఉత్తర అమెరికాలో అనేక తెలుగు సంఘాలకు ప్రతినిధిగా ఉన్నారు. దీంతో ఇప్పుడు జయరాం పైన వేటు అనివార్యమైనా..నిర్ణయం తీసుకున్న సందర్భం చర్చనీయాంశంగా మారింది.

తాజా ఎన్నికల్లో ఎంపీ సీటు అశించి..
కోమటి జయరాం చాలా కాలం క్రితం అమెరికాలో సెటిల్ అయ్యారు.కృష్ణా జిల్లాకు చెందని కోమటి జయరాం తొలి నుండి టీడీపీ అధినేత చంద్రబాబుతో సన్నిహితంగా ఉండేవారు. టీడీపీకి సేవలు అందించారు.ఏపీలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా అమెరికా నుండి కొందరు ప్రవాసాంధ్రులు ఏపీకి వచ్చి టీడీపీకి అనుకూలంగా ప్రచారం చేస్తారు. తాజా ఎన్నికల సమయంలోనూ అదే జరిగింది. ఇక, కోమటి జయరాం కొద్ది రోజుల క్రితం జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుండి ఎంపీగా పోటీ చేయాలని భావించారు. అందు కోసం విజయవాడ లేదా గుంటూరు స్థానాలను ఆశించారు. అక్కడ రెండు చోట్ల సిట్టింగ్‌లకే ఇవ్వాల్సి రావటంతో ఆయనకు సీటు దక్కలేదు. భవిష్యత్‌లో రాజ్యసభ సీటు ఇస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చినట్లు సమాచారం. అయితే, ఇప్పుడు ఏపీలో ప్రభుత్వం మారటం..గత ప్రభుత్వంలో ఇచ్చిన పోస్టు నుండి కోమటి జయరాంను తప్పించటంతో..ఇక ఇప్పుడు జగన్ ఈ బాధ్యతలను అమెరికాలో ఎవరికి అప్పగిస్తారనే ఆసక్తి కరమైన చర్చ మొదలైంది.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications