వాషింగ్టన్ డిసిలో ఆటా సమావేశం

వాషింగ్టన్ డిసి: అమెరికా తెలుగు సంఘం (ఆటా) 2014 మహాసభ కోసం వాషింగ్టన్ డిసి మెట్రో ఏరియాలో విరాళాల సేకరణ కార్యక్రమాన్ని ఈ నెల 19వ తేదీన నిర్వహించింది. ఈ ఒక్క కార్యక్రమం ద్వారానే ఆటా 400 మిలియన్ డాలర్ల విరాళాలను ఆటా సేకరించగలిగింది.

సమావేశం ప్రార్థనా గీతంతో ప్రారంభమైంది. 2014 మహాసభ సమన్వయకర్త, ఆటా అధ్యక్షుడు కరుణాకర్ మాధవరం భువనేశ్వరి బూజాల స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి 500కుపైగా తెలుగు కుటుంబాలు హాజరయ్యాయి. రుచికరమైన విందు భోజనాలు చేశారు. రఘు, రుషి తమ నృత్యాలతో ప్రేక్షకులను అలరించారు. అంజనా సౌమ్య రేలా రాలే పాటతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. రవి, వంశీ ప్రియ తమ ప్రదర్శనలతో అందరినీ అలరించారు.

ATA Raises funds for Conference in Washington DC Gala Event
తమ విరాళాల సేకరణ బృందం సభ్యులు రామ్ మట్టపల్లి, జయ్ చల్లా, గౌతం అమర్నేని, రవి పులి, పూర్ణ డొక్కులను భువనేష్ బూజాల పరిచయం చేశారు. ఆటా అధ్యక్షుడు కరుణాకర్ మాధవరం ట్రస్టీ బోర్డు సభ్యులను పరిచయం చేశారు. ఫిలడెల్ఫియాలో జులై 3 నంచి 5వ తేదీ వరకు జరిగే 13వ ఆటా మహాసభకు హాజరు కావాలని ఆయన ఒక్కొక్కరినీ పేరు పెట్టి ఆహ్వానించారు.

కన్వీరన్ పర్మేష్ భీమ్ రెడ్డి ఆటా - 2014 మహాసభ బృందాన్ని పరిచయం చేశారు. డిసి మెట్రో ఏరియా ట్రస్టీలు రాజేష్ మాదిరెడ్డి, సౌమ్య కొండపల్లి, జనేతా కంచర్ల, ఆడ్‌హాక్ కమిటీ సభ్యడు రామ్మోహన్ కొండా అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఆటా ఇతర నాయకులు లోకేష్ రెడ్డి, మనోహర్ ఏనుగు, జయ్ అన్నం, విషు కాల్వల, విష్ణు మాధవరం తదితరులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో విశేష కృషి చేసారు. డిసి ఏరియా ప్రాంతీయ సమన్వయకర్తలు వెంకట్ కొండపేలు, రవి బొజ్జ, శ్రీధర్ బాణాల ఏర్పాట్లు చేశారు.

శనివారం 19వ తేదీ ఉదయం మూడో వార్షిక బోర్డు సమావేశం జరిగింది. దాదాపు 300కి పైగా ఈ సమావేశానికి హాజరయ్యారు. 13వ మహాసభల్లో నిర్వహించాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. ట్రస్టీ సౌమ్యా కొండపల్లి ప్రార్థనా గీతంతో సమావేశం ప్రారంభమైంది. కార్యదర్శి అనంత్ రెడ్డి పజ్జూరు స్వాగతం పలికారు. ఈ ఏడాది తాము నిర్వహించన కార్యక్రమాలను అధ్యక్షుడు కరుణాకర్ ఆర్ మాధవరం వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+